అనుమానాస్పద స్థితిలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి

ఖమ్మం: అనుమానాస్పదస్థితిలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని కామేపల్లికి చెందిన జర్పుల లక్ష్మణ్‌నాయక్ పదేళ్ల క్రితం ఖమ్మం పరిధిలోని పాండురంగాపురానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్‌నాయక్ భార్య రమాదేవి గేటు కారేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. వారి కుమార్తె లిఖిత యామిని(19) చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ కళాశాలలో ట్రిపుల్ ఐటీ చదువుతోంది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సెలవులు కావడంతో లిఖిత యామిని […]

ఖమ్మం: అనుమానాస్పదస్థితిలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని కామేపల్లికి చెందిన జర్పుల లక్ష్మణ్‌నాయక్ పదేళ్ల క్రితం ఖమ్మం పరిధిలోని పాండురంగాపురానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్‌నాయక్ భార్య రమాదేవి గేటు కారేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. వారి కుమార్తె లిఖిత యామిని(19) చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ కళాశాలలో ట్రిపుల్ ఐటీ చదువుతోంది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సెలవులు కావడంతో లిఖిత యామిని పాండురంగాపురం వచ్చి మూడు నెలలుగా ఇంటి వద్దనే ఉంటోంది.

గత ఆదివారం కళాశాలకు వెళ్లవలసి ఉండగా తండ్రి వచ్చే ఆదివారం వెళ్లేందుకు తండ్రి లక్ష్మణ్ నాయక్ ట్రైన్ రిజర్వేషన్ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం తల్లి రమాదేవి పాఠశాలకు విధుల నిమిత్తం వెళ్లగా తండ్రి తన పనుల నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో లిఖిత యామిని ఒక్కతే ఉంది. పాఠశాలకు వెళ్లిన తల్లి 11 గంటల సమయంలో కుమార్తెతో మాట్లాడేందుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తమ ఇంట్లో కింద పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వాళ్లకు ఫోన్ చేసి తమ కూతురు ఫోన్ ఎత్తడం లేదనే విషయాన్ని చెప్పి పైకి వెళ్లి మాట్లాడించమని చెప్పింది.

ఓ పాప పైకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని లిఖిత యామిని వేలాడుతూ ఉండటాన్ని గమనించి గట్టిగా కేకలు వేస్తూ పరుగున క్రిందికి వచ్చి ఇంటి సభ్యులకు తెలియజేసింది. ఈ విషయాన్ని లిఖిత తల్లిదండ్రులకు తెలియజేశారు. లిఖిత యామిని కాళ్లు చేతులు చీరతో కట్టేసి ఉండటం, ఒంటిపై లెగ్గిన్ లేకపోవడంతో బంధువులు, స్థానికులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Comments

comments

Related Stories: