అడవి నుంచి ఆకాశానికి..

Anupriya Lakra

 

కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది ఈ గిరిజన యువతి. పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కన్‌గిరి జిల్లాకు చెందిన అను ప్రియా లక్రా అనే 23 ఏళ్ల గిరిజన యువతి మొట్టమొదటి మహిళా పైలట్ గా ఎంపికై తన కలను సాకారం చేసుకుంది.

మల్కాన్‌గిరి జిల్లా సేమిలిగూడ గ్రామానికి చెందిన మరినియాస్ లక్రా, జమజ్ యాస్మీన్ దంపతుల కుమార్తె అయిన అనుప్రియా మెట్రిక్యులేషన్ దాకా మల్కన్ గిరి కాన్వెంట్‌లో చదివింది. మరినియాస్ ఒడిశా పోలీసు హవల్దార్. అనుప్రియ పైలట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. భువనేశ్వర్ లో ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలో చదువు వదిలేసిన అనుప్రియ పైలెట్ ట్రైనింగ్ సెంటరులో చేరింది. ఏడేళ్ల పాటు పైలట్ శిక్షణను విజయవం తంగా పూర్తి చేసుకొని ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో కో పైలెట్ ఉద్యోగం సాధించింది. పైలట్ కావాలనే తన కలను నిజం చేసుకొని తమ ప్రాంత గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచింది.

అసలే మల్కన్ గిరి అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతం. ఏడేళ్ల కష్టం తర్వాత ఆమె అనుకున్నది సాధించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కూతురు సాధించిన విజయం పట్ల చాలా గర్వంగా ఉందంటున్నారు. లక్షం ఉండాలే గానీ ఎలాంటి సమస్యలైనా సులభంగా అధిగమించవచ్చని అంటోంది అనుప్రియ. ఈమె విజయం పట్ల నెటిజన్లు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒడిశా సీఎం కూడా ట్విట్టర్ ద్వారా ఆమెను అభినందించడం విశేషం.

Tribal Girl Anupriya Lakra become first female pilot

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అడవి నుంచి ఆకాశానికి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.