వడదెబ్బతో గిరిజన కళాకారుడు మృతి

Artist

జన్నారం: జన్నారం మండలం కొత్తూరుపల్లెకు చెందిన గిరిజన కళాకారుడు సోయం రత్నం (48)మంగళవారం ఉట్నూర్ మండలం అస్నాపూర్‌లో వీడియో చిత్రీకరణ చేస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గత 25 సంవత్సరాలుగా కళనే జీవితంగా రచయితగా, గాయకునిగా, గుస్సాడి, డెంస్మా, నృత్యకళాకారులుగా వీడియో గ్రాఫర్‌గా, ప్రైవేట్ ఆల్బమ్ లు చిత్రీకరించారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎన్నో ప్రోగ్రాములు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ గిరిజన గూడెం మూగోయింది.

నిరుపేద కుటుంబానికి చెందిన సోయం రత్నం భార్య సావిత్రి ఏడు సంవత్సరాల క్రితం షుగర్ వ్యాధితో మృతి చెందింది. మృతునికి తల్లిలింగుబాయ్ కుమారులు మధుసుదన్, రవిరాజ్‌లు ఉన్నారు. ఇంతకాలం పాటు రకరకాల పాటలు పాడి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించిన రత్నం మృతి చెందడంతో ఆయన కుమారులు, తల్లి అనాధలయ్యారు. జన్నారం మండలం ఆదర్శ కళాబృందం వ్యవస్థాపకులు లింగంపల్లి రాజలింగం మాట్లాడుతూ మృతి చెందిన కళాకారులు రత్నం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Tribal Artist Died of Sunstroke At Adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వడదెబ్బతో గిరిజన కళాకారుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.