సమత కేసులో 12మంది సాక్షుల విచారణ

  హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్‌మండలం ఎల్లా పటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసువిచారణ రెండోరోజు మంగళవారం ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమత కేసులో రెండో రోజు సాక్షులను పోలీసులు మంగళవారం కోర్టుహాల్‌లో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టులో సమత కేసు సాక్షుల విచారణ కొనసాగింది. కాగా సోమవారం ఏడుగురు సాక్షులను విచారించాల్సి ఉండగా కేవలం మృతురాలి భర్త, దగ్గరి బంధువును మాత్రమే […] The post సమత కేసులో 12మంది సాక్షుల విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్‌మండలం ఎల్లా పటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసువిచారణ రెండోరోజు మంగళవారం ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమత కేసులో రెండో రోజు సాక్షులను పోలీసులు మంగళవారం కోర్టుహాల్‌లో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టులో సమత కేసు సాక్షుల విచారణ కొనసాగింది. కాగా సోమవారం ఏడుగురు సాక్షులను విచారించాల్సి ఉండగా కేవలం మృతురాలి భర్త, దగ్గరి బంధువును మాత్రమే ప్రత్యేక కోర్టు విచారించింది.

మొదటి రోజు మిగిలిన ఐదుగురితోపాటు మంగళవారం నాటి షెడ్యూల్ ప్రకారం సాక్ష్యం చెప్పాల్సిన ఏడుగురు, మొత్తంగా 12 మందిని కోర్టు విచారించింది. డిసెంబర్31 వరకు సాక్షులను విచారించి వారి స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనున్నది. తర్వాత పోలీసులు నమోదు చేసిన డిఎన్‌ఎ, ఎఫ్‌ఐఆర్, ఇతర ఆధారాలు, సాక్షాధారాలు పరిశీలించి జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆదిలాబాద్‌ప్రత్యేక కోర్టు తీర్పువెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక కోర్టుకు వరంగల్ రేంజ్ ఐజినాగిరెడ్డి వెళ్లారు. కోర్టులో సమత కేసు విచారణ కూడా జరుగుతుండటంతో ఐజి నాగిరెడ్డి ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. రెండో రోజు విచారణ అనంతరం సమత కేసును ప్రత్యేక కోర్టు గురువారానికి డిసెంబర్26 నాటికి వాయిదా వేసింది.

Trial of 12 witnesses in Samata case

The post సమత కేసులో 12మంది సాక్షుల విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: