బిగ్‌బాస్‌లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్!

Bigg Boss 3

 

అందరినోట్లో బిగ్‌బాస్ చర్చే..విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభమైన బిగ్‌బాస్-3 రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారంలో నటి హేమ ఎలిమినేషన్‌కు గురై హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు హేమ స్థానంలో తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్‌ను వైల్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపించారు. హేమ స్థానంలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హజ్‌లోకి నాటీ నాటీ గార్ల్ అనే పాటతో ఎంట్రీ ఇచ్చింది.

ఇంటి సభ్యులు అందరూ ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇంతకీ ఈ తమన్నా సింహాద్రి ఎవరో, ఆమె గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. “ట్రాన్స్‌జెండర్ అయినా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందంటూ” బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, హౌస్‌లో చివరి వరకు ఉంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.

తమన్నా సింహాద్రి స్వస్థలం కృష్ణాజిల్లా అవనిగడ్డ. ఆమె అసలు పేరు సింహాద్రి మస్తాన్. వ్యవసాయ కుటుంబం ఈమె నేపథ్యం. టీడీపీ సీనియర్ నేత,మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తమన్నాకు పెద్దనాన్న అవుతారు. సినిమాల్లో రాణించాలన్న కోరికతో కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ముంబైకి కూడా వెళ్లింది.

అక్కడే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. ముంబైలోనే కొన్నాళ్లు జాబ్ చేసింది. వి కేర్ కంపెనీ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి మద్దతుగా ఉండి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియో జకవర్గం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తమన్నా పోటీ చేసింది.

Transgender Woman in Bigg Boss 3

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బిగ్‌బాస్‌లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.