ఇక.. డిజిటల్ బంధం…

  కమ్మర్‌పల్లి : మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం మహిళలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పొదుపు సంఘాల లెక్కలు డిజిటల్ కానున్నయి. సుమారు 23 ఏళ్లుగా పొదుపు వివరాలు కాగితాల్లో రికార్డులు తయారు చేయడం, సంఘాలకు తలనొప్పిగా మారింది. ప్రతి నెలా పొదుపు చేసిన సొమ్ము, తీసుకున్న రుణాలు, చెల్లించి వాయిదాలు, బ్యాంకుల్లో సంఘ బందాల్లోనూ, సంఘ మిత్రలోనూ రికార్డులు తయారు చేయడం కష్టంగా ఉండేది. మహిళలు తమ పొదుపు పై అనుమానం కలిగినప్పుడు […] The post ఇక.. డిజిటల్ బంధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కమ్మర్‌పల్లి : మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం మహిళలను చైతన్యం చేసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పొదుపు సంఘాల లెక్కలు డిజిటల్ కానున్నయి. సుమారు 23 ఏళ్లుగా పొదుపు వివరాలు కాగితాల్లో రికార్డులు తయారు చేయడం, సంఘాలకు తలనొప్పిగా మారింది. ప్రతి నెలా పొదుపు చేసిన సొమ్ము, తీసుకున్న రుణాలు, చెల్లించి వాయిదాలు, బ్యాంకుల్లో సంఘ బందాల్లోనూ, సంఘ మిత్రలోనూ రికార్డులు తయారు చేయడం కష్టంగా ఉండేది. మహిళలు తమ పొదుపు పై అనుమానం కలిగినప్పుడు రికార్డులు చూపించాలంటే సమస్యలు ఎదురయ్యేవి. అధికారులు బదిలీ ఆయినప్పుడు రికార్డుల్లో అప్పుడప్పుడు తేడాలు వచ్చి వాగాద్వాలు చోటు చేసుకున్నాయి.

డిజిటల్ దిశగా..
పొదుపు చేసుకున్న నిధులతో పాటు రుణాలు, ప్రభుత్వం సంఘాల కోసం ప్రవేశపెట్టిన పథకాలు సక్రమంగా అమలు పర్చేందుకు డిజిటల్ విదానం దోహదపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. రాష్ట్ర పరిధిలో ఉన్న పొదుపు సంఘాల పరిధిని ప్రస్తుతం ఇక నుంచి కేంద్ర స్థాయికి పెంచనున్నారు. మహిళాలు పొదుపు చేసుకున్న ఆ సొమ్మును వారికి వచ్చే పథకాలను అవినితి అక్రమాలు చోటు చేసుకోకుండా ఈ డిజిటల్ విధానం దోహద పడుతుంది, స్వయం సహాయక మహిళ పొదుపు సంఘాల ఖాతాలను డిజిటల్ చేసేందుకు ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు గ్రామ స్థాయి వీవోఎలకు శిక్షణ ఇచ్చారు.

డిజిటల్ విధానం ద్వారా ఇక నుంచి మహిళ పొదుపు వివరాలు రుణాలు, వారు చెల్లించే వాయిదాలు పథకాలు సక్రమంగా అమలు చేసేందుకు గానూ సద్వినియోగ పడుతుంది. పొదుపు చేసుకున్న నగదు నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని ఎన్నో సంఘాల్లో అవకతవకలు చోటు చేసేకున్నాయని మహిళ సంఘాల మద్య వివాదాలు, సమస్యలు వెలుగు చూశాయి. స్త్రి శక్తి సంఘ బంధం, చిన్న తరహా పరిశ్రమలకు కుటీర పరిశ్రమలకు స్వయం శక్తి మహిళలకు అందజేసిన పథకాల్లో అధికారులతో పాటు సంఘ బంధాల బాద్యులు పలు అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు, సమస్యలను ఈ డిజిటల్ విధానం ద్వారా పరిష్కామవుతాయి.

ప్రభుత్వం మహిళ సంఘాల పొదుపు, ఐక్యమత్యాన్ని దృష్టిలో పెట్టుకొని రుణాలను మంజూరు చేసింది. ఈ రుణాల పంపీణీలో అధికారులు పలు అక్రమాలకు పాల్పడినట్లు పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తీసుకున్న రుణాలను మహిళాలు సంక్రమంగా చెల్లించినప్పటికి ఖాతాల్లోకి చేరకుండా మద్యలో దుర్వినియోగమైనట్లు పలు ప్రాంతాలల్లో వివాధాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీటాన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. వరుస ఎన్నికల కారణంగా వాయిదా పడినా జూన్‌లో డిజిటల్ విధానం పై ముందుగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు శిక్షణ ఇచ్చారు. ఇటీవల గ్రామ స్థాయిలో వీవోఎలకు శిక్షణ పూర్తి చేసింది. ఇక సంఘ బంధాల మహిళాలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది.

డిజిటల్ విధానం ఎంతో మేలు
మహిళా సంఘాలు కుటుంబ అవసరాల నిమిత్తం పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు మహిళల్లో ఆర్థికాస్వాలంభన చైతన్యపర్చేందుకు ప్రభుత్వం పలు రకాల రుణాలతో పాటు చిన్న కుటీర పరిశ్రమల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి అందజేస్తుంది. ఈ పథకాలను సద్వినియోగం చేసేందుకు డిజిటల్ విధానం ఎంతో దోహద పడుతుంది. సొమ్ము చేసుకున్న ప్రతి రూపాయి ఖాతాలో భద్రంగా జమ అవుతుంది. తీసుకున్న రుణాలు రూపాయి పక్కాదారి పట్టకుండా లబ్దిదారులకు చేరేందుకు ఈ విధానంతో స్పష్టమవుతుంది.

రుణాలు చెల్లింపులో తమ వాయిదాలు తమ ఖాతా నుంచి సక్రమంగా వెళ్లి జమ అవుతున్న విధానం డిజిటల్‌లో స్థానిక బ్యాంకు ఖాతాలో కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ ఖాతాలో చూపిస్తుంది. ఈ విధానం ద్వారా మహిళ సంఘాలు జమ చేసుకున్న పొదుపు, రుణాలు దుర్వినియోగం కాకుండా సక్రమంగా ఉపయోగపడుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ వీవోఎలకు శిక్షణతో పాటు ట్యాబ్‌లను అందజేసింది. ఈ ట్యాబ్‌ల్లో డిజిటల్ విధానం మహిళ సంఘాల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రతి మహిళకు ఈ డిజిటల్ విధానం ద్వారా ఎంత నగదు ఉందో వెంటనే తెలిసిపోతుంది.

Transformation of Self-Help Groups Savings in to Digital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇక.. డిజిటల్ బంధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: