లాటరీ ద్వారా హోంగార్డుల బదిలీలు

Homeguards

 

ఆదిలాబాద్ : 2016 సంవత్సరంలో చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఉ మ్మడి జిల్లాలో భారీ ఎత్తున హోంగార్డులను ఆయా జిల్లాల్లో నిష్పత్తి ప్రకారం విభజించారు. గత మూడు సంవత్సరాల నుండి, తమ సొంత జిల్లాలకు ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తున్న తరుణంలో జిల్లా ఎస్పి అసాధారణ నిర్ణయంతో ఉమ్మడి జిల్లా హోంగార్డు విభాగంలో సంతోషం వ్యక్తమైంది. శనివారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం నుండి జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా లాటరీ పద్ధ్దతిని 209 మంది హో ంగార్డుల బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. ముందుగా హోంగార్డులకు కౌన్సిలింగ్ నిర్వహించి, అందరి ఆమోదం ప్రకారమే లాటరీ పద్దతిని ఎంచుకున్నట్లు తెలిపారు.

చిన జిల్లాలు ఏర్పడ్డాక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డులు దీర్ఘకాలంగా ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీ చేపట్టినట్లు తెలిపారు. లాటరీ పద్దతిలో ద్వారా నిర్మల్ జిల్లా 29+01, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 41+01, ఆదిలాబాద్ జిల్లా 61+36 హో ంగార్డులను బ దిలీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 38 మ ంది మహిళా హోంగార్డులు ఉన్నారని అన్నా రు. మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్న హో ంగార్డులే పని చేస్తున్నారని అక్కడ బదిలీల సమస్య లేదని తెలిపారు. లాటరీ ద్వా రా బదిలీల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో ఉత్తర్వు లు జారీ చేస్తామని తెలిపారు. రోజు వారి విధులకు ఆటంకాలు కలగకుండా తుది ఉత్తర్వులు వెలువడిన అనంతరం రోజు కొంత మ ంది రిలీవ్ కావచ్చని పేర్కొన్నారు.

అదనపు ఎస్పి టిఎస్ రవికుమార్, శిక్షణ కేంద్రం డిఎస్పి ఎల్‌సి నాయక్, ఆదిలాబాద్ ఏఆర్ డిఎస్పి సయ్యద్ సుజాఉద్దీన్, పోలీస్ కార్యాల యం అధికారులు, సందీప్, జగదీష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ఆ ర్‌ఐలు ఓ సుధాకర్‌రావు, వి వామనమూర్తి, కె ఇంద్ర వర్దన్, సిబ్బంది విఠల్, మదన్, భారత్ పాల్గొన్నారు.

Transfers of Homeguards by Lottery

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాటరీ ద్వారా హోంగార్డుల బదిలీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.