టిక్‌టాక్ వీడియో గేమ్‌లో విషాదం

 ticktack

 

బరేలీ (యుపి) : టిక్‌టాక్ వీడియో గేమ్ షూటింగ్ కోసం రివాల్వర్ పట్టుకున్న 18 ఏళ్ల బాలుడు ఆ రివాల్వర్ అకస్మాత్తుగా పేలడంతో ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన బరేలీ జిల్లా ముడియాభైకంపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. 18 ఏళ్ల బాలుడు కేశవ్ టిక్‌టాక్ వీడియో గేమ్ షూటింగ్ కోసమని తన తల్లి సావిత్రిని రివాల్వర్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆ రివాల్వర్‌లో తూటాలు ఉన్నాయన్న సంగతి వారికి తెలియదు. సావిత్రి ఇంటి బయట పనులు చేస్తుండగా రివాల్వర్ పేలుడు శబ్దం వినిపించింది. ఇంటిలోకి వెళ్లి చూడగా బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

Tragedy in the ticktack video game

The post టిక్‌టాక్ వీడియో గేమ్‌లో విషాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.