టాలీవుడ్ నటుడు నాగశౌర్యకు జరిమానా

 actor Nagasurya

 

హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు నాగశౌర్య ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలకు విరుద్దంగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి వెళ్తుండగా పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ ఐ రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు రూ. 500 జరిమానా విధించారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా, కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరిగా చట్టం చేసిన విషయం తెలిసిందే.

 

Traffic policemen who fined actor Nagasurya

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టాలీవుడ్ నటుడు నాగశౌర్యకు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.