ఎరువుల పేరిట మోసం…

 Farmers

 

పెద్దపల్లి రూరల్‌: అన్నం పెట్టే రైతుకు అన్ని కష్టాలే.. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు ఇలా అన్ని రకాల రైతు మోసానికి గురవుతున్నాడు. ఎరువులు, రసాయానాలు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి రైతులను దగా చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఇదే తంతును కొనసాగిస్తున్నారు. ఇలా ఎరువుల, రసాయనాల పేరిట మోసం చేయాలని చూసిన మల్లేశం అనే వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పెద్దబోంకూర్ గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం తరలిస్తున్న ట్రాలీని వ్యవసాయాదికారులు, హైదరబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.

వ్యవసాయ సహాయ సంచాలకులు క్రిష్ణరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎడిఎ శివానంద్ ఆద్వర్యంలో వారిన పట్టుకొని విచారించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దబోంకూర్ గ్రామ పరిధిలోని దస్తగిరిపల్లెలో కొంత మంది రైతులకు విక్రయించారు. వీరు గత వారం క్రితం పెద్దపల్లికి చెందిన వ్యక్తిని మార్కెటింగ్ పెట్టుకొని ఆర్డర్ తీసుకొని వెళ్లారు. బుధవారం వారికి డెలివరీ ఇవ్వటం కోసం ట్రాలీలో తీసుకువచ్చారు. 40 కిలోల బస్తాకు రూ.546, ఎరెజర్ రసాయనిక గడ్డిమందు రూ.449 గా ధర తో వారికి విక్రయించారు. వీటిపై అనుమానం వచ్చిన కొంత మంది రైతులు టాస్క్‌ఫోర్స్ అధికారులకు, వ్యసాయాధికారులకు సమాచారం అందించారు.

వెంటనే పెద్దబోంకూర్ క్రాస్‌రోడ్డు వద్ద మాటు వేసి వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. బయో పేరిట రసాయనిక మందులు, ఎరవుల విలువ సుమారు 60వేలు స్వాదీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటిని అంకాల పరమేశ్వరి కంపెనీకి చెందిన వాటిగ గుర్తించారు. ఈ సంచుల్లో చెత్త చెదారం, మట్టిని నింపారు. అనంతరం వారు మాట్లాడుతూ… రైతులు ఎరవులు కానీ, రసాయనిక మందులు కానీ కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారి వద్ద కొనుగోలు చేయరాదని, అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. తప్పని సరి కొనుగోలు చేసేటప్పుడు బిల్ తీసుకోవాలని సూచించారు. తక్కువ దర అనగానే మోస పోవద్దని, సేంద్రియ ఎరువులు వాడాలని తెలిపారు. ఈ సందర్బంగా సమాచారం అందించిన రైతులను వ్యవసాయాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అలివేణి, టాస్క్‌ఫోర్స్ డిప్యూటి డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఎస్సై దుర్గారావు, ఎఇవోలు వినయ్‌కుమార్, అర్చన తదితరులు ఉన్నారు.

 

Traders are Cheating Farmers with Counterfeit Manure

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎరువుల పేరిట మోసం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.