పంజాబ్‌లో 62కి పెరిగిన కల్తీసారా మృతుల సంఖ్య

Toxic alcohol deaths toll rises to 62 in Punjab

 

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ సారాకు బలైన వారి సంఖ్య 62కి పెరిగింది. రాష్ట్రంలోని తరన్ తరన్ జిల్లాలో మరో 23 మరణాలు శనివారం వెలుగు చూశాయి. శుక్రవారం రాత్రి ఇదే జిల్లాలో 19 మరణించగా శనివారం మరో 23 మంది మరణించడంతో ఈ జిల్లాలో కల్తీ సారా తాగి చనిపోయిన వారి సంఖ్య 42కి చేరుకుందని డిసిపి కుల్వంత్ సింగ్ తెలిపారు. తరన్ తరన్ జిల్లా కాకుండా అమృత్‌సర్‌లో 11 మంది, గుర్దాస్‌పూర్ జిల్లాలోని బటాలాలో 9 మంది కల్తీసారా తాగి మరణించినట్లు పోలీసులు చెప్పారు.

కాగా.. కల్తీసారా తాగి మరణించిన తమ కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించడానికి చాలా కుటుంబాలు ముందుకు రావడం లేదని పోలీసులు తెలిపారు. కొందరైతే పోస్ట్‌మార్టమ్ కూడా చేయించకుండా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారని వారు చెప్పారు. కల్తీసారాకు తమ ఆప్తులు మరణించారన్న విషయం బయటకు తెలియడం ఇష్టం లేకనే వారు అలా చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. కల్తీసారా కేసుకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Toxic alcohol deaths toll rises to 62 in Punjab

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పంజాబ్‌లో 62కి పెరిగిన కల్తీసారా మృతుల సంఖ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.