పర్యాటకులతో రద్దీగా మారిన నాగార్జునసాగర్‌

Nagarjunasagar

 

నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ వద్దకు సందర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో అధికారులు మొత్తం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పర్యాటకులకు వరుస సెలవు దినాలు రావడంతో ఆ దృశ్యాలను దగ్గర నుంచి విక్షించేందుకు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో ఫైలాన్ నుంచి హిల్ కాలనీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లాంచి స్టేషన్ నుంచి పిల్లర్ పార్కు వరకు వాహనాలు నిలవడంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపడుతున్నారు.

Tourists throng Nagarjunasagar as inflows continue

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పర్యాటకులతో రద్దీగా మారిన నాగార్జునసాగర్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.