ఆగస్టులోనూ సీన్ మారలేదు

vehicle sales

 

23.55 శాతం పడిపోయిన సేల్స్
అధ్వాన్న స్థితికి ఆటో పరిశ్రమ

ముంబై : ఆగస్టులో ఆటోమొబైల్ అమ్మకాలు అధ్వాన్న స్థితికి చేరాయి. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. మందగమన పరిస్థితుల్లో ఆటో రంగం ఆందోళనకరంగా మారిందని సియామ్(దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం) నివేదిక పేర్కొంది. హోల్‌సేల్ వాహన అమ్మకాల రికార్డులను నమోదు చేయడాన్ని 199798 నుంచి ప్రారంచామని, అప్పటి నుంచి చూస్తే ప్రస్తుత పరిస్థితి చాలా దారుణమైందని సియామ్ పేర్కొంది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలతో సహా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఆగస్టులో 18,21,490 యూనిట్లు నమోదైనాయి.

గతేడాది ఇదే సమయంలో 23,82,436 యూనిట్లు నమోదయ్యాయి. అంటే గతేడాది పోలిస్తే 23.55 శాతం క్షీణించింది. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 31.57 శాతం పడిపోయి ఆగస్టులో 196,524 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాదిలో ఈ సేల్స్ 2,87,198 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. మరోవైపు ఎగుమతులు పురోగతి కనిపించింది. ఎగుమతులు 14.73 శాతం పెరగడమ గమనార్హం. అయితే ఆటో అమ్మకాల క్షీణత ఈ రంగంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల నష్టానికి దారితీస్తోంది.

వాహన కంపెనీలు ఇప్పటికే 15 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్‌షిప్‌లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు. మాంద్యం కొనసాగితే మరో 10 లక్షల మంది ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. అటు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత వారం హర్యానాలోని తన గురుగ్రామ్, మానేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

Total vehicle sales in country fell by 23.55%

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆగస్టులోనూ సీన్ మారలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.