ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం

  జలమయమైన ఓరుగల్లు నగరం.. నియోజకవర్గ కేంద్రాలు.. జలదిగ్భంధంలో ఏజెన్సీ గ్రామాలు.. పొంగిపొర్లుతున్న చెరువులు.. కుంటలు.. కటాక్షపూర్ చెరువు మత్తడితో నిలిచిపోయిన ఏటూరునాగారం రహదారి.. వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి వరకు కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి గ్రామాలు, పట్టణాలు, నగరం వరదల్లో మునిగిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో కురిసిన […] The post ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జలమయమైన ఓరుగల్లు నగరం.. నియోజకవర్గ కేంద్రాలు..
జలదిగ్భంధంలో ఏజెన్సీ గ్రామాలు..
పొంగిపొర్లుతున్న చెరువులు.. కుంటలు..
కటాక్షపూర్ చెరువు మత్తడితో నిలిచిపోయిన ఏటూరునాగారం రహదారి..

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి వరకు కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి గ్రామాలు, పట్టణాలు, నగరం వరదల్లో మునిగిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారుల్లోనే మోకాలుబంటి వరదనీరు చేరింది. లోతట్లు కాలనీల న్ని జలమయమైపోయాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గా ల్లో వర్షం భారీ ఎత్తున కురిసింది. ఆదివారం మధ్యాహ్నం నుండి వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మం డలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా సాయం త్రం నుండి ఉమ్మడి జిల్లాలోని వరంగల్ అర్బన్, రూర ల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది.

వీటితో పాటు మహబూబాబాద్, జనగాం జిల్లా లో పాక్షికంగా వర్ష పాతం నమోదైంది. ఆదివారం కు రిసిన వర్షాలకు రైతులు పండించిన మెట్ట, వరి పం టల్లో వరద ఏరులై పారింది. దాంతో రైతులు తీవ్ర ఇ బ్బందులకు గురయ్యారు. ఇటీవలనే వరినాట్లు వేసిన రైతులకు రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలకు వరి నాటు మునిగిపోయింది. దీంతో చేసేదీ లేక రైతు లు పొలాలకు గండి పెట్టి నీటిని వెళ్లిపోయే విధంగా చే స్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పత్తి, మొక్కొజొన్న, పల్లి పంటలకు ఈ వర్షం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. పల్లి చేను పంట చేతికొచ్చిన సమయంతో వరుసగా కురుస్తున్న వర్షాలకు భూమిలోనే మొలకెత్తే పరిస్థితి వస్తుంది.

పత్తి పంటలు వరద నీరు నిలిచిపోవడం వల్ల పత్తి పంట ఎరుపు ఎక్కుతుంది. ప్రధాన జలాశయాలైన రామప్ప, లక్నవరం, పాకాల సరస్సులకు భా రీ ఎత్తున నీరు చేరుతుంది. చెరువులు, కుంటలు మత్త ళ్లు పోస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి రూ రల్ జిల్లాలోని కటాక్షపూర్ చెరువు మత్తడిపోస్తుండడంతో వరంగల్‌కు ఏటూరునాగారంకు వెళ్లే రహదారిపై నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను అక్కడి నుండి వెళ్లకుండా రూట్ మళ్లించారు. ఏజెన్సీ గ్రామాల్లోని వాగులన్నీ ఉప్పొంగుతుండడంతో అటవీ గ్రామాలు జలదిగ్భంధానికి గురయ్యాయి. శనివారం నుండి కురుస్తున్న వర్షాలు ఆదివారం రాత్రి వరకు కు రుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా వర్షపాతం ఉంటే జనజీవనం స్తంభించిపోయే అవకాశం ఉంది.

 

Torrential rain in joint Warangal district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: