ఆస్తమా నుంచి ఉపశమనం పొందేందుకు..

  ఆస్తమా అనేది జన్యుపరంగా, పర్యావరణ పరమైన కారణాల వల్ల వస్తుంది. ఆస్తమా వచ్చిన వారి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో దగ్గు, గురక వస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే డాక్టర్‌ను సంప్రదించవచ్చు. దీంతోపాటు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆస్తమాను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా ..! 1. ఒక గ్లాస్ పాలలో ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి […]

 

ఆస్తమా అనేది జన్యుపరంగా, పర్యావరణ పరమైన కారణాల వల్ల వస్తుంది. ఆస్తమా వచ్చిన వారి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో దగ్గు, గురక వస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే డాక్టర్‌ను సంప్రదించవచ్చు. దీంతోపాటు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆస్తమాను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా ..!

1. ఒక గ్లాస్ పాలలో ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించి అనంతరం ఆ పాలను తాగాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. రోజూ తాగే టీలో అల్లం, వెల్లుల్లి రసాలను సమానంగా వేసి టీ తాగితే ఆస్తమా నుంచి బయట పడొచ్చు.
3. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగినా ఉపశమనం పొందవచ్చు.
4. రాత్రి పూట ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో కొన్ని మెంతులను వేసి నానబెట్టాలి. వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తే ఆస్తమా నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా శ్వాస సరిగ్గా అందుతుంది. అలాగే మరేఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.
5. తులసి ఆకులను కొన్నింటిని ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపునే తిన్నా, లేదంటే తులసి ఆకులతో చేసిన టీని తాగినా, ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగితే అందులో ఉండే ఔషధ గుణాలు శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా నుంచి బయట పడవచ్చు.

Tops for Breathing problems relief

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: