టాప్ 8 కంపెనీల విలువ రూ.1.69లక్షల కోట్లు అప్

Tata-Consultancy-Service

ముంబై: గత వారం టాప్ 10 కంపెనీల్లో ఎనిమిది సంస్థ మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ. 1.69లక్షల కోట్లు పెరిగింది. వీటిలో ఐటి దిగ్గజం టిసిఎస్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలు అత్యధికంగా మార్కెట్ విలువను పెంచుకున్నాయి. గతవారం మార్కెట్ మంచి లాభాలను నమోదు చేసింది. దీంతో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఎనిమిది బ్లూచిప్ కంపెనీలు మొత్తంగా రూ.1,69,865 కోట్ల మార్కెట్ విలువను పెంచుకున్నాయి. గతవారం సెన్సెక్స్ 1,662.34 పాయింట్లు అంటే 5 శాతం లాభపడింది.

ఆఖరికి 35,011.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీల మార్కెట్ విలువ విషయానికొస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అత్యధికంగా రూ.41,351 కోట్ల మార్కెట్ విలువను పెంచుకుని రూ.7,16,630 కోట్లకు చేరింది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) ఎంక్యాప్ రూ. 33,333 కోట్లు పెరిగి రూ. 2,54,752.35 కోట్లకు చేరింది. ఐసిఐసిఐ బ్యాంకు విలువ రూ. 25,271 కోట్లు పెరిగి రూ. 2,28,030.59 కోట్లుగా ఉంది.

హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.20,763.9 కోట్లు పెరిగి రూ. 3,12,970.02 కోట్లకు చేరింది. ఇక రిలయన్స్ ఎంక్యాప్ రూ. 18,730.2 కోట్లు పెరిగి రూ. 6,80,910.61 కోట్లు కాగా, హెచ్‌యుఎల్ విలువ రూ. 15,834 కోట్లు లాభపడి రూ. 3,53,617 కోట్లకు పెరిగింది. మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఎంక్యాప్ రూ. 12,471.8కోట్లు పెరిగి రూ. 2,89,209.72 కోట్లకు చేరగా, ఎఫ్‌ఎంసిజి దిగ్గజం ఐటిసి విలువ రూ. 2,109 కోట్లు పెరిగి రూ. 3,45,701 కోట్లకు చేరింది.

వీటికి విరుద్ధంగా కొటక్ మహింద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 4,910 కోట్లు తగ్గి రూ. 2,16,133 కోట్లకు క్షీణించింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంక్యాప్ కూడా రూ. 4,171.8 కోట్లు పడిపోయి రూ. 5,29,122.57 కోట్లకు చేరింది. ర్యాంకింగ్ పరంగా చూస్తే మొదటి స్థానంలో టిసిఎస్, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.

Top Ten Companies Asset Value Increased

Telangana news