విజయనిర్మల భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు

 

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆస్పత్రి నుంచి విజయనిర్మల మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించారు.  విజయనిర్మల భౌతికకాయాన్ని చూసిన సూపర్ స్టార్ కృష్ణ బాధతో బోరున విలపించారు. ఆమెతో తన 50 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుని కృష్ణ విలపించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

విజయనిర్మల మృతిపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె పార్థివదేహాన్ని ఇవాళ ఇంట్లోనే ఉంచి రేపు ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

Tomorrow Actress Vijaya Nirmala last rites

The post విజయనిర్మల భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.