వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ

హైదరాబాద్ : మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. వరుణ్ తేజ్ నటించిన  ‘గద్దలకొండ గణేశ్’ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆయన తన కొత్త సినిమాపై దృష్టి సారించారు. వరుణ్ తేజ్ కు ఇది పదో సినిమా కావడం గమనార్హం. కిరణ్ కొర్రపాటి  వరుణ్ పదో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ […] The post వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభమైంది. వరుణ్ తేజ్ నటించిన  ‘గద్దలకొండ గణేశ్’ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆయన తన కొత్త సినిమాపై దృష్టి సారించారు. వరుణ్ తేజ్ కు ఇది పదో సినిమా కావడం గమనార్హం. కిరణ్ కొర్రపాటి  వరుణ్ పదో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను పరిశీలిస్తే, బాక్సింగ్  నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. సిద్ధు ముద్ధ, అల్లు బాబీలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సినిమా యూనిట్ వెల్లడించింది.

Tollywood Hero Varun Tej New Movie Start

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: