‘ఆవిరి’ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Aaviriహైదరాబాద్ : ర‌విబాబు దర్శకత్వంలో వస్తున్న ‘ఆవిరి’ సినిమా ఫస్ట్ లుక్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ తదితరులు కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ‘ఆవిరి’ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. గతంలో పందిపిల్ల కీలక పాత్రలో రవిబాబు ‘అదుగో’ సినిమాను తీశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రవిబాబు కొంతకాలం గ్యాప్ తీసుకుని విభిన్న కథతో ‘ఆవిరి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాతోనైనా ఆయన విజయం దక్కించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

Tollywood Film Aaviri First Look Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ఆవిరి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.