కృష్ణవంశీ కొత్త సినిమా షురూ

Director Krishna Vamsiహైదరాబాద్ : క్రియేటీవ్ దర్శకుడు కృష్ణవంశీ తన కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. 2016లో వచ్చిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారు. అభిషేక్ -మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలికాలంలో కృష్ణ వంశీ సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ‘రంగమార్తాండ’తో విజయం సాధించాలన్న ఆలోచనలో కృష్ణ వంశీ ఉన్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Tollywood Director Krishna Vamsi New Movie Begins

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కృష్ణవంశీ కొత్త సినిమా షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.