అమ్మకు వందనం

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు వారి తల్లులను గుర్తు చేసుకున్నారు. అమ్మలతో తమకున్న అనుబంధం గురించి తెలియజేశారు. అమ్మకు వందనం అంటూ కీర్తించారు. తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను పట్టుకున్న బెస్ట్ చేతులు మా అమ్మవే. నా పిల్లలు కూడా వారి అమ్మ చేతులు పట్టుకునే ఎదుగుతున్నారు. ఇంతకుమించి ఇంకేం కావాలి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైన మా […] The post అమ్మకు వందనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు వారి తల్లులను గుర్తు చేసుకున్నారు. అమ్మలతో తమకున్న అనుబంధం గురించి తెలియజేశారు. అమ్మకు వందనం అంటూ కీర్తించారు. తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను పట్టుకున్న బెస్ట్ చేతులు మా అమ్మవే. నా పిల్లలు కూడా వారి అమ్మ చేతులు పట్టుకునే ఎదుగుతున్నారు. ఇంతకుమించి ఇంకేం కావాలి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైన మా అమ్మ, నా పిల్లల అమ్మ, ప్రపంచంలోని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు-”అని తెలిపారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ “నా జీవితంలో వండర్ ఉమెన్, నా హీరో, నా బలం, నా ఆశ మా అమ్మే. హ్యాపీ మదర్స్ డే-”అని చెప్పారు. కోన వెంకట్ మాట్లాడుతూ “ఈ ప్రపంచంలోని గొప్ప తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మమ్మల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు”అని అన్నారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ “నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నీ వల్లే నేను ఇంత ఫన్నీగా, నిబద్ధతగా, దృఢంగా ఉండగలుగుతున్నాను. నీకు బెస్ట్ అమ్మగా ఉంటానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఏ తల్లి నిన్ను మించిన బెస్ట్ కూతుర్ని కోరుకోదు. ఐ లవ్యూ యాపిల్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్-”అని పేర్కొన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “నాకు బెస్ట్ అమ్మ దొరికినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను”అని చెప్పారు. ఛార్మి మాట్లాడుతూ “ఈ అందమైన మహిళకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నీ ప్రేమే కాదు నాపై నీకున్న నమ్మకం కూడా నిస్వార్ధమైనదే-”అని తెలిపారు. సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ “మా అమ్మ ప్రేమ ముందు ఎవరి ప్రేమ సరిపోదు. ఓ తల్లి అయినప్పుడు కలిగే అనుభూతి వర్ణించడానికి మాటలు సరిపోవు. మా అమ్మ లతకు మదర్స్ డే శుభాకాంక్షలు-”అని అన్నారు. జాన్వికపూర్ మాట్లాడుతూ “తల్లి విలువను గుర్తించండి. వారి మాటలు వినండి. ఈ ప్రపంచంలోని ఎనలేని ప్రేమను వారికి పంచండి. హ్యాపీ మదర్స్ డే-”అని తెలియజేశారు.

రష్మీగౌతమ్ మాట్లాడుతూ “నెవర్ సే నెవర్ అన్న పదాన్ని నీ నుంచే నేర్చుకున్నాను. కష్టసమయాల్లో నిలదొక్కుకున్నావు. ఈ తరానికి అన్నీ సులువుగా దొరకుతున్నా కూడా వారిలో ఆ ధైర్యాన్ని చూడలేకపోతున్నాను. నేను నీ వజ్రాన్ని అంటుంటావు. ఈరోజు నన్ను ఓ మహిళగా మార్చావు. హ్యాపీ మదర్స్ డే మామ్. ఇప్పుడు నా భుజాలపై నువ్వు సేదతీరాల్సిన సమయం వచ్చింది”అని అన్నారు. కత్రినాకైఫ్ మాట్లాడుతూ “మా అమ్మ ఎంత అందంగా ఉందో చూశారా. నీ అంతగా మమ్మల్ని ప్రేమించేవారు లేరు”అని చెప్పారు. సారా అలీఖాన్ మాట్లాడుతూ “మా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు స్ఫూర్తిగా నిలుస్తూ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అమ్మా”అని అన్నారు. శ్రద్ధాకపూర్ మాట్లాడుతూ “మా అమ్మ నా జీవితం, నా సర్వస్వం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నీ నిస్వార్ధంలేని ప్రేమ, నా కోసం నువ్వు చేసే ప్రతి పని నాకెంతో స్ఫూర్తిదాయకం”అని తెలిపారు. జెనీలియా మాట్లాడుతూ “డియర్ అమ్మా.. నేను తల్లిని కావడానికి కొన్ని నిమిషాల ముందు అసలేం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. కానీ అంతా బాగానే ఉంటుందని నీకు ముందే తెలుసు. అమ్మంటే ఇలా ఉండాలని ఓ ఉదాహరణగా నిలిచినందుకు ధన్యవాదాలు. నీ పిల్లల్ని ఎలా పెంచావో నా కుమారులను కూడా అలాగే పెంచుతానని మాటిస్తున్నాను. నా చెయ్యి పట్టుకుని నాకు దారి చూపించు-”అని చెప్పారు. సోనమ్‌కపూర్ మాట్లాడుతూ “నా జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తికి మదర్స్ డే శుభాకాంక్షలు. నువ్వే నా బలం, ధైర్యం. నువ్వు నా జీవితానికి, కుటుంబానికి ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక్క రోజు కాదు కదా ఏడాది కూడా సరిపోదు-”అని అన్నారు.

 Tollywood Celebrities says Mothers day wishes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమ్మకు వందనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.