తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడి మృతి

మన తెలంగాణ/శాలిగౌరారం: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి కిందపడి గీతకార్మికుడు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని ఆకారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆకారం గ్రామానికి చెందిన బడేటి సత్తయ్య (58) గత 40 సంవత్సరాలుగా కల్లుగీత వృత్తిపై ఆధారపడి, కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఉన్న తన వాటాకు చెందిన తాటిచెట్లను ఎక్కేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో […]

మన తెలంగాణ/శాలిగౌరారం: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి కిందపడి గీతకార్మికుడు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని ఆకారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆకారం గ్రామానికి చెందిన బడేటి సత్తయ్య (58) గత 40 సంవత్సరాలుగా కల్లుగీత వృత్తిపై ఆధారపడి, కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో ఉన్న తన వాటాకు చెందిన తాటిచెట్లను ఎక్కేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తాటిచెట్టు ఎక్కి, కల్లు తీస్తుండగా, ప్రమాదవశాత్తు మోకు జారిపోవడంతో తాటిచెట్టుపైనుండి కిందపడ్డాడు. అదేసమయంలో కల్లు తాగేందుకు తాటిచెట్లు వద్దకు వచ్చిన కొంతమంది గమనించి, దగ్గరకు వెళ్లి చూసేసరికి సత్తయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో గట్టిగా కేకలు వేసి, ఇరుగుపొరుగు వారికి ఈవిషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని, కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుమారుడు బి.వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Toddy worker dies after falling from palm tree

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: