నేడు, రేపు ఎస్‌ఐ అభ్యర్థుల రాతపరీక్షలు…

   అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం  దళారులను నమ్మి మోసపోవద్దు  కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్లైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్‌ఐ (సివిల్/ఎఆర్/టిఎస్‌ఎస్‌పి/ఎస్‌పిఎఫ్/ఎస్‌ఏఆర్‌సిపిఎల్/ఫైర్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాల్లో అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహించబోతున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. దేహాదారుఢ్య, శారీరక సామర్థ్ధ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం నిర్వహించే రాతపరీక్షకు ఎలాంటి అటంకాలు కలగకుండా చర్యలు […] The post నేడు, రేపు ఎస్‌ఐ అభ్యర్థుల రాతపరీక్షలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
 దళారులను నమ్మి మోసపోవద్దు
 కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో స్లైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్‌ఐ (సివిల్/ఎఆర్/టిఎస్‌ఎస్‌పి/ఎస్‌పిఎఫ్/ఎస్‌ఏఆర్‌సిపిఎల్/ఫైర్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాల్లో అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహించబోతున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. దేహాదారుఢ్య, శారీరక సామర్థ్ధ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం నిర్వహించే రాతపరీక్షకు ఎలాంటి అటంకాలు కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ విబి.కమలాసన్‌రెడ్డి శుక్రవారం వి లేకర్ల సమావేశంలో తెలిపారు. 22 కేంద్రాలలో పరీక్షను నిర్వహించబోతున్నట్లు ఆ యన తెలిపారు. దేహాదారుఢ్య, శారీరక సామర్థ పరీక్షల్లో అర్హత సాధించిన 10 వే ల 475 మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపా రు.

కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్ గ్రామాలలోని 22 కేంద్రాలలో అభ్యర్థు లు రాతపరీక్షలు రాయబోతున్నట్లు ఆయన వివరించారు. వాగేశ్వరి ఇంజనీరింగ్, ఫార్మసి కళాశాలలు, శ్రీచైతన్య ఇంజనీరింగ్, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలు, నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పి.జి క ళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశా ల, వివేకానంద డిగ్రీ అండ్ పి.జి కళాశాల, కి మ్స్ డిగ్రీ అండ్ పిజి కళాశాల, వాణినికేతన్ డిగ్రీ అండ్ పిజి కళాశాల, వాగేశ్వరి డి గ్రీ క ళాశాల, అపూర్వ శివాని డిగ్రీ కళాశాల ల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జ రిగిందన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మ ధ్యా హ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నా రు. ఇదిలా ఉండగా ఉద్యోగం ఇప్పిస్తామంటూ వచ్చే మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సిపి కమలాసన్‌రెడ్డి అభ్యర్థులకు సూచించారు. ప్రతిభ, సామర్ధం మీదనే ఆధారపడి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ వచ్చే వారికి సంబంధించిన సమచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కరీంనగర్ పోలీసు కమిషనర్ విబి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Today, tomorrow the written exams of the SI candidates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు, రేపు ఎస్‌ఐ అభ్యర్థుల రాతపరీక్షలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: