ఉన్నదాంట్లో కొంత పంచుదాం

Mercy

 

మనకున్న దాంట్లోనే కొంత ఇతరులకు ఇవ్వడంలో ఉన్న సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఇవ్వడానికి మనసుండాలిగానీ బాగా డబ్బున్నవాళ్లం అయి ఉండనక్కర్లేదు. దయాగుణం గొప్పదనాన్ని తెలియజేయడానికి ఓ రోజు కూడా ఉంది అదే అంతర్జాతీయ దయా గుణ దినోత్సవం. ఇవ్వటంలో దొరికే సంతోషాన్ని గుర్తు చేస్తున్న రోజు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 34 శాతం సంపద 0.2 శాతం మంది దగ్గర కేంద్రీకృతమై ఉంది. మిగిలిన 99.8 శాతం మంది ప్రజలు 66 శాతం సంపదను పంచుకుంటున్నారు. యూనిసిసెఫ్ లెక్కల ప్రకారం 240 కోట్ల మంది ప్రజలు కనీసం పారిశుద్ధ సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నారు. ప్రతిరోజు 16 వేల మంది పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ అంతర్జాతీయ దయాగుణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికి రెండు దశాబ్దాలుగా 1998 నుంచి ఈ దినోత్సవం పాటిస్తున్నారు. ఉన్నదేదో నలుగురితో పంచుకోవటమే అసలైన మనిషి తత్వం. ఈ విషయాన్ని మనకు ప్రకృతే నేర్పుతుంది. ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది కార్పొరేట్ దిగ్గజాలు తమకున్న సంపదను ప్రజల కోసం పంచి ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. మనదేశంలో ఉన్నన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంకే దేశంలోనూ లేవు. నేడు అంతర్జాతీయ దయాగుణ దినోత్సవం సందర్భంగా ఆదాయంలో ఒక్క శాతం అయినా తోటివాళ్లకోసం ఖర్చు చేయాలని ఓ చక్కని నిర్ణయం తీసుకోగలిగితే చాలు, కొన్ని వేలమంది పిల్లల భవిష్యత్తు బాగు పడుతుంది.

Today is International Day of Mercy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉన్నదాంట్లో కొంత పంచుదాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.