నేడు గుడ్‌ఫ్రైడే

ఖమ్మం: మానవ పాప పరిరక్షణకు దేవుడు శరీరధారియై క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పరిశుధ్ద జీవితం గడిపి, ఏ పాపమూ లేకుండా తన ప్రాణత్యాగం చేసిన రోజును గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. శుభ శుక్రవారంగా వ్యవహరించే ఈ రోజున కల్వరి కొండపై జరిగిన ఘట్టాన్ని ప్రధానంగా వివరిస్తారు. ఏసుక్రీస్తును దేవుడిగా విశ్వసించని ప్రజలు ఆయనను హింసించి, కొట్టి, అవమానించి ఒక నేరస్తుడిగా సిలువ వేశారు. ఆయన చేతులలోనూ, కాళ్లలోనూ మేకులు కొట్టి సిలువకు వ్రేలాడదీసారు. ఇష్ట పూర్వకంగానే ఏసు […] The post నేడు గుడ్‌ఫ్రైడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: మానవ పాప పరిరక్షణకు దేవుడు శరీరధారియై క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పరిశుధ్ద జీవితం గడిపి, ఏ పాపమూ లేకుండా తన ప్రాణత్యాగం చేసిన రోజును గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. శుభ శుక్రవారంగా వ్యవహరించే ఈ రోజున కల్వరి కొండపై జరిగిన ఘట్టాన్ని ప్రధానంగా వివరిస్తారు. ఏసుక్రీస్తును దేవుడిగా విశ్వసించని ప్రజలు ఆయనను హింసించి, కొట్టి, అవమానించి ఒక నేరస్తుడిగా సిలువ వేశారు. ఆయన చేతులలోనూ, కాళ్లలోనూ మేకులు కొట్టి సిలువకు వ్రేలాడదీసారు. ఇష్ట పూర్వకంగానే ఏసు తన ప్రాణాలను మానవుల పాపాల కోసం సిలువలో అర్పించాడు. అందుకే ఆయన ’నా ప్రాణాలు తీయు శక్తి ఎవరికీ లేదు. నేనే అర్పిస్తున్నా’ అంటాడు.

ఆ కాలంలో సిలువ అనేది నరహంతకులకు, దొంగలకు, బందిపోట్లకు వేసే కఠినమైన శిక్ష. ఈ శుభ శుక్రవారం రోజున గబ్బాతా అనే ప్రాంతం నుండి ఉదయం 9గంటలకు క్రీస్తుతో మోయలేని అతిపెద్ద సిలువను మోయించి, వీధుల గుండా నడిపించి, గొల్గైతా అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకోవటానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. దారి పొడవునా విశ్వాసులు కంట తడిపెట్టి, ఏమీటయ్యా నీకిష్టం. మాకోసం ఎందుకీ శిక్ష అని ఏడ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ ప్రాంతమంతా చీకటి ఆవరించి ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర కాంతి విహీనం చెందాయి. కల్వరి ప్రాంతంలో ఆయనకు సిలువ వేసారు. ఈ సందర్బంగా ఆయన శిలువపై ఏడు మాటలను పలికారు. నాకోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తాడు. అంత బాధలోనూ ఆయన తమ గురించి ఆలోచించటం చూసి ప్రతి ఒక్కరు చలించిపోయి భోరున ఏడ్చారు.

ప్రత్యేక ప్రార్దనలకు సిద్ధమైన ఖమ్మం చర్చిలు

గుడ్‌ఫ్రైడే నాడు ప్రతి చర్చిలో ప్రత్యేక ప్రార్దనలు చేస్తారు. క్రీస్తు శ్రమలకు గుర్తుగా గుడ్‌ఫ్రైడేకు 40 రోజుల ముందు నుండి ఉపవాస దీక్షలు జరుపుతారు. దీనినే లెంట్‌డేస్ లేదా శ్రమ దినాలు అంటారు. ఈ దినాల్లో చర్చిల్లో ఎలాంటి సాంప్రదాయ ఆచారాలు, వివాహాలు, వేడుకలు చేయడం నిషిద్దం. కొన్ని చర్చిల్లో సిలువపై నల్లని బట్టను కప్పుతారు. 40 రోజుల్లో చివరి దినాన్ని ఫ్యాషన్‌ వీక్‌గా భావిస్తారు. ఉపవాస ప్రార్థనలు చేసి దుఃఖంతో కీర్తిస్తారు. క్రీస్తు శ్రమలను 14 విభాగాలుగా విభజించి ఆయన పొందిన బాధలను జపిస్తూ గడుపుతారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రైస్తవులు సిలువ ధ్యానంలో గడుపుతారు. ఈ సందర్భంగా ఏసు సిలువపై చెప్పిన ఏడు మాటలను మననం చేసుకుంటారు. కొద్ది మంది నల్లని దుస్తులు దుఃఖానిక సూచనగా ధరిస్తారు. పలు చర్చిల్లో క్రీస్తు సిలువ యాత్రను నిర్వహిస్తారు. నాటికలను ప్రదర్శిస్తారు. సిలువను అందరూ మోయటానికి ప్రయత్నిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు క్రీస్తు న్యాయాధిపతుల వద్దకు లాక్కొని రాబటం, సిలువలో మరణించటంతో ధ్యానిస్తారు. ఆయన శరీరం, రక్తాలను అపురూపంగా భావించి స్వీకరిస్తారు. క్రీస్తు తాను చెప్పినట్లుగా సజీవంగా లేచే ఈస్టర్ సండేకోసం ఎదురుచూస్తుంటారు.

Today is Good Friday celebrations in khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు గుడ్‌ఫ్రైడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: