జగదేక జనయిత్రి

  శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. పురాణాల్లో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు, రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం. పార్వతీపరమేశ్వరుల ఆరాధనే నవరాత్రోత్సవాల వ్రతమని పిలుస్తారు. నేడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా […] The post జగదేక జనయిత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. పురాణాల్లో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు, రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం. పార్వతీపరమేశ్వరుల ఆరాధనే నవరాత్రోత్సవాల వ్రతమని పిలుస్తారు.

నేడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరా శక్తికి మినప గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యం పెడతారు.

అమ్మవారి నైవేద్యం

మినప గారెలు
కావాల్సిన పదార్థాలు : మినపప్పు1 కిలో, జీలకర్ర: 1టీస్పూన్, మిరియాలు1టీస్పూను, అల్లం ముక్కలు: ఒకటిన్నర టీస్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒకటిన్నర టీస్పూన్లు, కరివేపాకురెండు రెబ్బులు, ఉప్పు: రుచికి తగినంత, నూనె వేయించడానికి తగినంత
తయారు చేసే విధానం: మినపప్పు కనీసం మూడుగంటల సేపు నానబెట్టి, నీటిని ఒంపేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు కలపాలి. అరచేతిలో నొక్కి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

Today Devi is decorated as Annapurna Devi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జగదేక జనయిత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: