15 తర్వాతే ఐపిఎల్‌పై నిర్ణయం

ముంబై: కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) భవితవ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. దాని ప్రకారమే దేశంలో క్రీడా పోటీల నిర్వహణ ఆధారపడి ఉందన్నారు. ఇక, ఐపిఎల్ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఏప్రిల్ 15 తర్వాతే ఏదైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పటి […] The post 15 తర్వాతే ఐపిఎల్‌పై నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) భవితవ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. దాని ప్రకారమే దేశంలో క్రీడా పోటీల నిర్వహణ ఆధారపడి ఉందన్నారు. ఇక, ఐపిఎల్ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఏప్రిల్ 15 తర్వాతే ఏదైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు భారత క్రికెట్ బోర్డు వేచి చూడక తప్పదన్నారు. ఇదిలావుండగా క్రికెట్ అనేది ఒలింపిక్ క్రీడ కాదని, దీంతో దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం క్రికెట్ బోర్డుకే ఉందన్నారు. తాము కేవలం సూచనలు, సలహాలు మాత్రమే ఇస్తామన్నారు. కాగా, కరోనా కట్టడి చేయాలంటే పలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఇందులో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఐపిఎల్ వంటి మెగా టోర్నీలపై ఆంక్షలు విధించక తప్పడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

 To be Decided on IPL 2020 After April 15: Kiren Rijiju

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 15 తర్వాతే ఐపిఎల్‌పై నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.