మాజీ భర్తను చితకబాదిన ఇద్దరు భార్యలు

 

కోయంబత్తూరు: మూడవ పెళ్లి సిద్ధపడిన ఒక వ్యక్తిని అతడు వదిలేసిన ఇద్దరు భార్యలు చితకబాదారు. తమిళనాడులోని కోయబత్తూరు జిల్లా సూలూరులో ఈ సంఘటన బుధవారం జరిగింది. 26 ఏళ్ల దినేష్‌కు 2016లో ప్రియదర్శినితో పెళ్లయ్యింది. అతడు పెట్టే వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక పెళ్లయిన కొద్ది వారాలకే ఆమె తిరుపూరులోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి దినేష్ 2019లో కరూరుకు చెందిన అనుప్రియను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా కొద్ది నెలలకే అదే గతి పట్టించాడు. కాగా, తమకు నమ్మకద్రోహం చేసిన తమ భర్త మూడో పెళ్లి కోసం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడని ప్రియదర్శిని, అనుప్రియకు తెలిసింది. దీంతో వారిద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలసి కోయంబత్తూరులో దినేష్ పనిచేస్తున్న ఆఫీసుకు చేరుకున్నారు. అయితే అతడిని కలిసేందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించడంతో ఆ ఇద్దరు భార్యలు కంపెనీ గేటు బయటే ధర్నాకు దిగారు. కొద్ది సేపటికి దినేష్ ఆఫీసు బయటకు రావడంతో వారంతా అతనితో గొడవ పడ్డారు. మాటలు కాస్తా చేతలకు మారి వారంతా దినేష్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని దినేష్‌ను రక్షించారు. అతడిని ప్రశ్నించేందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

 

 

TN man was beaten up by his ex wives, The first two wives also alleged that he had harassed them physically and mentally.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ భర్తను చితకబాదిన ఇద్దరు భార్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.