లక్ష్యాలను చేరుకోవాలంటే

  చాలా మంది లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. కానీ వాటిని నెరవేర్చుకోవడంలో వెనుకబడుతుంటారు. ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. మరికొందరేమో ఆడంబరంగా పనిమొదలుపెడతారు. లక్ష్యాలను చేరుకోవాలంటే కొంత రిస్క్‌ కూడా చేయాలంటారు నిపుణులు. 1. ఆలోచన వచ్చిందే తడవుగా చేసేద్దాం అనుకోకూడదు. అది ఎంత ఆచరణాత్మకమో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే మొదలుపెట్టాలి. 2. సమయం, అవకాశాలు అందరికీ సమానంగానే ఉన్నా, వాటిని అందిపుచ్చుకునే మార్గాలే వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే అవసరానికి తగిన మార్పులు చేసుకోవడానికి ఎప్పటికప్పుడు […]

 

చాలా మంది లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. కానీ వాటిని నెరవేర్చుకోవడంలో వెనుకబడుతుంటారు. ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. మరికొందరేమో ఆడంబరంగా పనిమొదలుపెడతారు. లక్ష్యాలను చేరుకోవాలంటే కొంత రిస్క్‌ కూడా చేయాలంటారు నిపుణులు.

1. ఆలోచన వచ్చిందే తడవుగా చేసేద్దాం అనుకోకూడదు. అది ఎంత ఆచరణాత్మకమో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే మొదలుపెట్టాలి.

2. సమయం, అవకాశాలు అందరికీ సమానంగానే ఉన్నా, వాటిని అందిపుచ్చుకునే మార్గాలే వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే అవసరానికి తగిన మార్పులు చేసుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇలాంటప్పుడు ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఫలితం ఉండదు సరికదా! మరింత కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీతో మీరు పోటీపడండి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది.

3. లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు అందరికీ ఒకే తరహా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తు పల్లాలు సహజం. కష్టం కలిగినప్పుడు కుంగిపోవడం, సంతోషంగా ఉన్నప్పుడు ఉప్పొంగిపోవడం సరికాదు. మీ ఉద్వేగాలను నియంత్రించుకోకపోవడం వల్ల అది మీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వాటిపై పట్టు సాధించగలిగితే…మీ లక్ష్యానికి చేరువైనట్లే.

Tips to Reach Targets

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: