ఇంటర్వ్యూకి ఇవి తప్పని సరి

ఒక ఎగ్జామ్ బాగా రాస్తే జాబ్ వచేస్తుందిలే అని అనుకునే రోజులు కావు ఇప్పుడు. ఇంటర్వూలు రెండు, మూడు సార్లు పిలుస్తున్నారు. రకరకాల స్కిల్స్ ఉద్యోగార్థులు పెంపొందించుకోవాలి. ముందర జాబ్ సెర్చ్ చేసేటప్పుడు అభ్యర్థి ఎక్కువ ఒత్తిడికి గురవుతాడు. దానిని అధిగమించాలి. ఇంటర్వూలలో నెగ్గేందుకు కొన్ని కొత్త పోకడలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు . అవేంటో చూద్దాం. ఇంటర్వూ ఎక్కువ సేపు ఉంటే అన్ని ప్రశ్నలకి సమగ్రంగా సమాధానం చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. అందుచేత పక్కా ప్రణాళికతో […]

ఒక ఎగ్జామ్ బాగా రాస్తే జాబ్ వచేస్తుందిలే అని అనుకునే రోజులు కావు ఇప్పుడు. ఇంటర్వూలు రెండు, మూడు సార్లు పిలుస్తున్నారు. రకరకాల స్కిల్స్ ఉద్యోగార్థులు పెంపొందించుకోవాలి. ముందర జాబ్ సెర్చ్ చేసేటప్పుడు అభ్యర్థి ఎక్కువ ఒత్తిడికి గురవుతాడు. దానిని అధిగమించాలి. ఇంటర్వూలలో నెగ్గేందుకు కొన్ని కొత్త పోకడలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు . అవేంటో చూద్దాం.

ఇంటర్వూ ఎక్కువ సేపు ఉంటే అన్ని ప్రశ్నలకి సమగ్రంగా సమాధానం చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. అందుచేత పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏమి అడుగుతు న్నారు, మనం ఏమి చెబుతున్నాం, సమాధానాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తున్నాం అనేది ఒక పద్ధతిలో ఉండాలి. సోషల్ మీడియా, జాబ్ పోర్ట్‌ల్స్ పరిశీలనలో చురుకుగా ఉండాలి. వీటిలో సామర్థం తప్పక ఉండాలి. అవగాహనా లోపం ఉండకూడదు. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయం లోనే కంపెనీకి తాను ఎలా ఫిట్ అన్నది అభ్యర్థి తెలియజేయాలి.కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా అభ్యర్థి తన లక్ష్యాలు, విలువలు, నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో వివరించాలి. అదే సమయంలో తన విధుల నిర్వరించే క్రమంలో భాగంగా కంపెనీ తన నుంచి ఏమి ఆశిస్తోందో తెలుసుకోవాలి.దీంతో కంపెనీకి అభ్యర్థిపైన ఒక నమ్మకం వస్తుంది. ఇంత వరకు చేసిన పని తదితరాలన్నీ వారికి తెలియచేయాలి. అబద్దాలు ఉండకూడదు. సమయానికి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవడం, మంచి డ్రెస్సింగ్, ఐ కాంటాక్ట్, చెప్పే విషయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం, గతంలో సాధించిన విజయాల వివరణలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నుంచి కంపెనీ ఏమి ఆశిస్తోందో తెలియచేయాలి. తుది ఎంపికకు సంబంధించి మర్యాదగా ప్రశ్నించి తెలుసు కోండి. ఇంటర్వ్యూ అనంతరం ఫాలోఅప్‌ను అస్సలు మర్చిపోవద్దు. అవకాశం ఉందా అని అడగడం ద్వారా, మిమ్మల్ని తీసుకుంటే కంపెనీకి అదనంగా సమకూరే విలువే అన్నది అర్థమయ్యేలా ఈ అనుకరణ సాగాలి.

Comments

comments

Related Stories: