జుట్టు పెరగాలంటే!

Hair

 

జుట్టు రాలకుండా అందంగా జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలకుండా ఉంటాలంటే మంచి చిట్కాలని పాటిస్తే చాలు.
* జుట్టు కి సహజ పోషకాహారంతో పాటు సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు కి పెరుగుదల ఉంటుంది.
* తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మీ జుటుకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించి చూడండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పౌష్టిక ఆహారం : సహజ సిద్ధమైన మీ జుట్టుకి అందించే మంచి పౌష్టిక ఆహారాన్నితీసుకోవడం ద్వారా మీ జుట్టు రాలకుండా ఉంటుంది. పౌష్టిక ఆహారంలో విటమిన్స్ వల్ల శిరోజాలకి మంచి విటమిన్స్ అందేలా చూస్తుంది, జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.

కొబ్బరి నూనె : జుట్టుకి మంచి స్వచ్ఛమైన కొబ్బరినూనెని వేడి చేసి గోరు వెచ్చటి నూనెతో తలకి మసాజ్ చేయాలి. ఆ తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టు కి మంచి రక్తప్రసరణ జరిగి ఒత్తయిన జుట్టు మీ సొంతం.

ఒత్తిడి : మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటే.. చాలా మంచిది. జుట్టుకి పెద్ద కారణం మానసిక ఇబ్బందులు. వాటికీ దూరంగా ఉంటే జుట్టుకి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనవచ్చు.

షాంపూలు : వాడే షాంపూలు సరైనవి ఎంచుకోవాలి. తలస్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేసుకొని తరువాత తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుంది.
* ఇలా సులభమైన చిట్కాలు పాటించి చూడండి. మీ శిరోజాలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Tips to avoid Hair loss

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జుట్టు పెరగాలంటే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.