కాంజీవరం చీరల మెరుపు, భద్రత కోసం!

Kanjivaram sarees

 

ఆడవారు చీరలంటే చాలా ఇష్టాన్ని చూపుతారు. శుభకార్యాలకు పట్టు చీరలు కట్టుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. చీరల మెరుపును, నిలబెట్టుకోవడం, వాటిని భద్రపరుచుకోవడం, కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సులువైన చిట్కాల ద్వారా చీరలు చక్కని మన్నికతో పాటు ఆకర్షణను చాలకాలం నిలుపుకోవచ్చు.

1. పట్టు లేదా ఖరీదైన చీరలు ఉతికే ముందు వాటిని ఎట్టి పరిస్థితులలోను మెలి పెట్టకండి. ఉతికిన తర్వత అదనంగా ఉన్న నీటిని తొలగించాలంటే? దానిని హ్యాంగర్‌కు తగిలించి వేలాడదీయండి. నేరుగా సూర్య కాంతి పడకుండా జాగ్రత్త పడండి. ఆ తరువాత చీరను అక్కడి నుంచి తీసి చల్లని నీటిలో ముంచి, వెనిగర్ వాసన పూర్తిగా పోయే వరకూ అలాగే జాడించండి.

2. ప్రతీ 3 నెలలకు ఒకసారైనా వాటి మడతలను విప్పి బయటకు తీయడం ద్వారా, ముడతలు పడడాన్ని శాశ్వతంగా నివారించవచ్చు. అలాగే ప్రతీ 2-,3 నెలలకు ఒకసారి నీడలో గాలికి ఆరేయడం ద్వారా వాటి జీవిత కాలాన్ని మరింతగా పెంచవచ్చు.

3. సిల్క్ చీరలు చాలా ఖరీదు. కానీ వాటిని సరిగా ఉపయోగించగలిగితే, అందం- ఆకర్షణ కోల్పోకుండానే అవి దశాబ్దాల పాటు మన్నగలుగుతాయి.

4. ప్రతీ మూడు నుంచి ఆరు నెలలకు వాటిని బయటకు తీయడం, తిరిగి మడత పెట్టడం మాత్రమే కాకుండా, వాటిని ఇతర పదార్ధాలతో రూపొందించిన చీరలతో కలిపి ఉంచకండి. వీటిని ప్రత్యేకంగా భద్రపరచండి.

Tips for lightning and safety of kanjivaram sarees

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంజీవరం చీరల మెరుపు, భద్రత కోసం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.