ఇవి మీ జ్ఞాపక శక్తిని కాపాడతాయట!

Brain

 

జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ముఖ్యంగా ఆరు ఆహార పదార్థాలు తోడ్పాటునందిస్తాయి. ఇవి స్పష్టతతో ఆలోచించడానికి కూడా సహకరిస్తాయి. ఆ ఆరు ఆహారపదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.

1. ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలు: ఇతర కొవ్వు పదార్థాలతో పోలిస్తే.. ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయట. ఇవి ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల నుంచి లభిస్తాయి. అలాగే గుడ్డు, వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు సంతృప్తికరంగా ఉంటాయి.

2. యాంటీ ఆక్సిడెంట్స్: మెదడును ఫ్రీ-రాడికల్స్ నుంచి కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కృషి చేస్తాయి. గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, క్యారెట్, వెల్లుల్లి, తృణధాన్యాల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

3. ప్రోటీన్లు: నాడీ కణాల మధ్య సమన్వయానికి హై టైరీసిన్ ప్రోటీన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. గుడ్డు, సముద్రపు ఆహారం, డైరీ ఉత్పత్తుల్లో ఈ ప్రోటోన్లు దొరకుతాయి.

4. నీరు: ఒక్కోసారి డీ హైడ్రేషన్ వల్ల కూడా మెదడు తన శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి.

5. విటమిన్స్, మినరల్స్: అన్ని శరీర భాగాల్లాగే మెదడుకు విటమిన్లు, మినరల్స్ అవసరం ఎంతో ఉంది. రోజువారి ఆహారం ద్వారా లభించే విటమిన్లు, ఖనిజాలతోపాటు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మంచిది.

6. ఫైబర్: నాడీ కణాలకు గ్లూకోజ్ సప్లయ్ చేయడంలో ఫైబర్ పాత్ర కీలకమైనది. అన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఖర్జూరాలు, బీన్స్ వంటి వాటిల్లో ఫైబర్ పుష్కలంగా లభ్యమవుతుంది.

Tips for improve memory power

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇవి మీ జ్ఞాపక శక్తిని కాపాడతాయట! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.