వేసవిలో ఆరోగ్యం జర జాగ్రత్త…!

– పండ్లతో మేలు – నీటిని ఎక్కువగా తీసుకోవాలి -వైద్యుల సలహాలను పాటించాలి హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : వేసవి కాలం వచ్చింది. ఎండలతో పాటు వడగాడ్పులు, దాహం, నీరసం తదితర సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.  ఎండలకు ఒకటే ఉష్ణోగ్రతతో పాటు పగలు సమయం ఎక్కువగాను. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవి కూడా చల్లగా ఆస్వాదించవచ్చని వైద్యులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు… * ఆహార పదార్థాల్లో నూనె తక్కువగా వాడాలి. […] The post వేసవిలో ఆరోగ్యం జర జాగ్రత్త…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

– పండ్లతో మేలు
– నీటిని ఎక్కువగా తీసుకోవాలి
-వైద్యుల సలహాలను పాటించాలి
హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : వేసవి కాలం వచ్చింది. ఎండలతో పాటు వడగాడ్పులు, దాహం, నీరసం తదితర సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.  ఎండలకు ఒకటే ఉష్ణోగ్రతతో పాటు పగలు సమయం ఎక్కువగాను. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవి కూడా చల్లగా ఆస్వాదించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
* ఆహార పదార్థాల్లో నూనె తక్కువగా వాడాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* ఉదయం పూట ఆల్పాహారంలో నూనె వంటకాలు కాకుండా, ఆవిరి కుడుములు, ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
* కర్బూజాలు ఎక్కుగా తీసుకోవాలి. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే మిటమిన్ ఏ, డీ శరీరానికి ఎక్కువగా అందుతాయి.
* కిటికీలకు గుమ్మాలకు పట్టివేళ్ల తెరలని తడిపి కర్టెన్స్ మాదిరిగా కట్టుకుంటే వేడిని ఇంటిలోకి రానివ్వకుండా చూసుకోవచ్చు.
* సాధారణంగా పిల్లలు వేసవి సెలవుల్లో ఎండలోకి వెళ్లి ఆటలు ఆడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా ఎండలోకి వెళ్లనీయకుడా ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
* పలుచని మజ్జిగలో కాసింత నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచింది.
* వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో, కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌లు చేసుకొని తాగేలా శ్రద్ధ వహించాలి.
* పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం, నానబెట్టిన నీళ్లు, సగ్గు బియ్యం, వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగించడం అలవాటు చేయాలి.
* తాటి ముంజులు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నీరు, ఆహారం కలుషితమైతే…
* వండిన పదార్థాలు ఎండాకాలం త్వరగా చెడిపోతాయి. అజాగ్రత్తగా ఉంటే, నిల్వ ఆహారం తింటే వాంతులు, విరేచనాలు కావచ్చు. ఇంట్లో గానీ బయటి తింటే ఈ లక్షణాలు మరింతగా కనిపిస్తాయి.
* దాహం చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక నీరు తాగితే కూడా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలా శరీరంలో నీరు హరిచుకుపోయి డీ హైడ్రేషన్ గురి కావొచ్చు.

కంకడ్లపై ప్రభావం…
* ఎండకాలం కళ్ల కలక వేగంగా వ్యాపిస్తుంది. దూమ్ము, దూళి వల్ల వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్ త్వరగా పాకిపోతుంది. ఒక్కసారి చూపు మందగించి రేటిన పై ప్రభావం చూపవచ్చు.

వేసవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు…
* చలి తగ్గి ఎండలు ముదరక ముందే ఆటలమ్మ  పిల్లల మీమద దాడి చేస్తుంది. అది ఒకరి నుంచి మరొక్కరికి వేగంగా వ్యాపిస్తుంది.
* గవద బిళ్లలు, టైఫాయిడ్, పొంగు, హైపటైటిస్ ఏ, కామెర్లు కూడా ఎండకాలంలో బాగా వ్యాపిస్తాయి.
* ఇవ్వన్ని టీకాలతో నిరోధించే ఇన్‌పెక్షన్లే. గతంలో మనం తెలుసుకున్న టీకాల వల్ల వీటిని నివారించవచ్చు. ఆటలమ్మ టీకా ఒకటిన్నర సంవత్సరాలు నిండిన ప్లిలలకు తప్పకుండా ఇవ్వాలి. 4-6 సంవత్సరాలకి రెండో మోతాదు ఇవ్వాలి. లేకపోతే పెద్దయ్యకా వారికి సర్ఫి అని అతి భయంకరమైన వ్యాధి సంభవించవచ్చు. మూత్రం ఇన్‌పెక్షన్ ఎండకాలంలో సర్వ సాధారణమన్న విషయం తెలిసిందే. తగినన్ని నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Tips for Health Care in Summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేసవిలో ఆరోగ్యం జర జాగ్రత్త…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: