లంచ్ బాక్సుల్లో చెడు వాసన రాకుండా..

  ప్లాస్టిక్ బాక్సుల్లో లంచ్ పెట్టుకుని ఆఫీసులకు తీసుకెళ్లడం సర్వసాధారణ విషయం. కొన్న కొత్తల్లో ఈ బాక్సులు ఎంతో శుభ్రంగా ఉంటాయి. కానీ కొన్ని రోజులు వాడిన తర్వాత వీటితో సమస్యలు మొదలవుతాయి. డబ్బాల మీద మచ్చలు పడటమే కాకుండా, బాక్సు మూత తీయగానే ఒకలాంటి దుర్వాసన వస్తుంది. అందుకే ఇలాంటి బాక్సులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేట్టు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ అవి ప్లాస్టిక్‌వి కావడం వల్ల జాగ్రత్త తప్పనిసరి. రాత్రి లంచ్ బాక్సు […]

 

ప్లాస్టిక్ బాక్సుల్లో లంచ్ పెట్టుకుని ఆఫీసులకు తీసుకెళ్లడం సర్వసాధారణ విషయం. కొన్న కొత్తల్లో ఈ బాక్సులు ఎంతో శుభ్రంగా ఉంటాయి. కానీ కొన్ని రోజులు వాడిన తర్వాత వీటితో సమస్యలు మొదలవుతాయి. డబ్బాల మీద మచ్చలు పడటమే కాకుండా, బాక్సు మూత తీయగానే ఒకలాంటి దుర్వాసన వస్తుంది. అందుకే ఇలాంటి బాక్సులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేట్టు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ అవి ప్లాస్టిక్‌వి కావడం వల్ల జాగ్రత్త తప్పనిసరి.

రాత్రి లంచ్ బాక్సు కడిగిన తర్వాత అందులో కాస్త ఉప్పు చల్లి గట్టిగా మూతపెట్టాలి. ఇలా చేయడం వల్ల లంచ్ బాక్సు చెడు వాసన రాదు. అంతేకాదు లోపల చేరిన సూక్ష్మజీవులు కూడా పూర్తిగా నశిస్తాయి. రోజు విడిచి రోజు కొన్ని కాఫీ గింజలను ఆ బాక్సులో వేసి రాత్రంతా ఉంచితే కూడా బాక్సు దుర్వాసన రాదు. ఇవి రెండూ కాకుండా మరో చిట్కా కూడా ఉంది. బాక్సును తోమిన తర్వాత అందులో నిమ్మ తొక్కను వేసి రాత్రంతా అలాగే ఉంచేస్తే బాక్సులో ఉండే చెడు వాసన పోతుంది. లేకపోతే న్యూస్‌పేపర్‌ను ఉండచుట్టి బాక్సులో వేసి గట్టిగా మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచి కడిగేస్తే కూడా దుర్వాసన పోతుంది.

Tip to avoid bad smell in lunch boxes

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: