చైనాకు దూరంగా టిక్‌టాక్

TikTok Could Move Out Of China
వ్యతిరేకత కారణంగా మార్పులు చేపట్టే యోచనలో కంపెనీ

న్యూఢిల్లీ: భారతదేశంలో నిషేధించిన టిక్‌టాక్ యాప్ పట్ల అమెరికాలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వ్యాపారంలో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. టిక్‌టాక్‌ను చైనా అధికార కార్యాలయానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తోంది. బైట్‌డాన్స్ లిమిటెడ్ తన టిక్ టాక్ వ్యాపారం కార్పొరేట్ నిర్మాణంలో మార్పులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ఆందోళనల నేపథ్యంలో టిక్‌టాక్ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశమయ్యారు. టిక్‌టాక్ కోసం కొత్త మేనేజ్‌మెంట్ బోర్డును సృష్టించడం, చైనా వెలుపల యాప్ కోసం ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వంటి ఎంపికలు చర్చించినట్టు సమావేశంలో పాల్గొన్న ఒక అధికారి వెల్లడించారు.

TikTok Could Move Out Of China

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చైనాకు దూరంగా టిక్‌టాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.