ప్రాణాల మీదకు తెచ్చిన టిక్ టాక్ సరదా

Tik Tok

బెంగళూరు: టిక్‌టాక్ వీడియో సరదా యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది.  కర్నాటక రాష్ట్రం తుమ్కూరుకు చెందిన శివస్వామి టిక్‌టాక్ వీడియో కోసం గాల్లో పల్టీలు కొట్టాడు. ఆ ప్రయోగం వికటించడంతో శివ స్వామి మెడపై ల్యాండ్ అయ్యాడు. భూమిని బలంగా తాకడంతో శివ స్వామి మెడ విరిగిపోయింది. ఆస్పత్రిలో శివ చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. టిక్‌టాక్ పేర్లతో డెంజర్స్ స్టంట్స్ ఘటనలు పెరిగిపోయాయి. దీంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అంత సవ్యంగా జరిగిను పర్వాలేదు కానీ శివ స్వామి అపశృతి జరిగితే జీవతం కోల్పోవాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పక్కగా నేర్చుకున్న తరువాతనే డెంజర్స్ స్టంట్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Tik Tok Video: Tik Tok Stunt in Karnataka

The post ప్రాణాల మీదకు తెచ్చిన టిక్ టాక్ సరదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.