“వజ్ర పాత్ యాప్‌”తో పిడుగుల సమాచారం

Vajra Path App

 

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న “వజ్రపాత్ యాప్‌”
పిడుగులు పడే సమాచారం తెలియజేయనున్న వజ్ర పాత్ యాప్‌పై “మన తెలంగాణ” ప్రత్యేక కథనం

కొణిజర్ల : వర్షాకాలం మొదలైతే చాలు ఎక్కడో ఒక చోట పిడుగులు పడి అపార ప్రాణ, ఆర్ధిక నష్టం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు వ్యవసాయ పనులు చేసుకుంటూ చేలల్లో ఉంటారు. ఆ క్రమంలో పిడుగుపాటుకు గురై రైతులతో పాటు ఎద్దులు కూడా మరణిస్తాయి. అయితే పి డుగు పడటానికి 30 నిమిషాల ముందే పలు ప్రాం తాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి ఎంతో అవకాశం ఉంటుంది.

అలాంటి సమాచారాన్ని తెలుసుకోవటాని కి నూతన యాప్ అందుబాటులోకి వచ్చింది. పిడుగుపాటును ముందే తెలుసుకొని అప్రమత్తం చేసేందుకు ఈ యాప్ తోడ్పడుతోంది. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ వజ్రపాత్‌యాప్‌తో రెండు రకాల సమాచారం తెలుసుకోవచ్చు. దీని కోసం మన దగ్గర ఆధునిక చరవాణి ఉంటే చాలు.

తెలుసుకోవటం ఎలా..?
కాస్ట్ ప్రైస్.. కామ్ ఆన్ లైన్ ఇండియా, ప్రైవేట్ సంస్థ ఐఎస్‌ఆర్‌ఓ ఏసి, ఎస్, హెచ్ ఈ ఎర్త్ నెట్ వర్క్ సహకారంతో ఈ సమాచార యాప్ పురుడు పోసుకుంది. ఆధునిక చరవాణికి అంతర్జాలం అనుసంధానమై ఉం టే సరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డోన్లోడ్ చే సుకుని అందులో చరవాణి నెంబరు నమోదు చేసుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. యాప్‌లో తెరపై ఎడమ చేతి వైపు పిడుగు గు ర్తుతో పాటు పిడుగు సమాచారాన్ని చూడవచ్చు. ఇక్క డ నొక్కితే మనం ఉన్న ప్రాంతంతో సహా చిత్రపటం క నిపిస్తుంది. ఎరుపు, నారింజ రంగులో మూడు వలయాలు కనిపిస్తాయి.

వీటి పక్కనే 8, 15, 30 అని అంకెలు ఉంటాయి. కొద్ది సేపట్లో ఇంత దూ రంలో పిడుగు పడే అవకాశం ఉందని గుర్తు. అలాంటిది ఏ మి లేకపోతే సమీపంలో పిడుగు పడే అవకా శం లే ద ని సమాచారం కనిపిస్తుంది. ఎంతో దూరంలో పిడుగు పడే అవకాశం ఉందో కూడా పిన్ రూపంలో కనిపిస్తుంది. చరవాణి కుడి వైపున పిడుగుపాటు హె చ్చరికలు ఉన్న సమాచారం గుర్తు ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆకాశం మేఘావృతం సంకేతాలు ఉన్న చోట పిడుగు పడే అవకాశాలు ఉన్నాయో లేవో అన్న సమాచారం కనిపిస్తుంది. దీంతో అప్రమత్తం కావచ్చ ని ని పుణులు తెలియజేస్తున్నారు. ఇందులో పిడుగు పా టుకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలని సమాచారం పొందుపరిచారు.

Thunderbolts Information With Vajra Path App

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post “వజ్ర పాత్ యాప్‌”తో పిడుగుల సమాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.