పుల్వామాలో ఎన్ కౌంటర్…. ముగ్గురు తీవ్రవాదులు హతం

Three terrorists dead in Encounter in Jammu

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బందికి, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీ మందు గుండు సామాగ్రి, ఎకె 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు కంగన్ ప్రాంతంలో నక్కి ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో  భారత్ సైనికులు ఎదురుకాల్పులు జరిపారు.

The post పుల్వామాలో ఎన్ కౌంటర్…. ముగ్గురు తీవ్రవాదులు హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.