నిన్న తప్పిపోయారు…నేడు శవమై తేలారు…

Students

 

 నిజామాబాద్ :పాఠశాల విరామ సమయంలో బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శుక్రవారం కనబడకుండా పోగా శనివారం సమీపంలోని చెరువులో శవమై తేలిన సంఘటన నిజామాబాద్‌నగర శివారులోని నాగారంలో చోటు చేసుకుంది. గ్రామంలో విషాదచాయలు నింపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగారంలోని 80వ క్వార్టర్స్‌కు చెందిన ఎండి ఆజార్ (8), అర్బాస్ (9), సోయల్ (11)లు నాగారం ప్రభుత్వ ఉర్దుమీడియం పాఠశాలలో చదువుతున్నారు. అర్బాస్, ఆజార్ 3వ తరగతి చదువుతుండగా, సోయాల్ 4వ తరగతి చదువుతున్నాడు.

ఈ ముగ్గురు విద్యార్థులు శుక్రవారం ఇంటర్‌బెల్ సమయంలో బయటకు వెళ్లిపోయారని, సాయంత్రం తమ పిల్లలు ఇంటికి రాకపోయే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు 5వ టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, గుంతలు, చెరువుల్లో వెతికిన ఫలితం లేకపోయింది. శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ ఉర్దుమీడియం వెనుక ఉన్న గుంతలో ముగ్గురు విద్యార్థుల శవాలై తేలాయని అన్నారు. ఘటన స్థలానికి ఎస్సై జాన్‌రెడ్డి, సిఐ శ్రీనాథ్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, మూడు శవాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉర్దుమీడియం హెచ్‌ఎంపై చట్టపరమైన చర్యలుతీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల దుర్మరణంలో 80 క్వార్టర్స్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.

Three Students killed fall in Pond

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిన్న తప్పిపోయారు… నేడు శవమై తేలారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.