కథువా కేసులో ముగ్గురికి జీవిత ఖైతు…

  మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు పఠాన్‌కోట్ కోర్టు తీర్పు ఒకరికి నిర్దోషిగా విముక్తి కశ్మీర్ దాటి పంజాబ్ చేరిన కేసు ఏడాదికి పైగా విచారణ భూ కక్షలకు బలి అయిన బాలిక ఆలయంలోనే మత్తుమందిచ్చి అత్యాచారం పఠాన్‌కోట్ : జమ్మూ కశ్మీర్‌లోని కథూవాలో బాలికపై అత్యాచారం హత్య ఉదంతంలో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. మరో ముగ్గురికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పఠాన్‌కోట్ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. కథూవాలో […] The post కథువా కేసులో ముగ్గురికి జీవిత ఖైతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు
పఠాన్‌కోట్ కోర్టు తీర్పు
ఒకరికి నిర్దోషిగా విముక్తి
కశ్మీర్ దాటి పంజాబ్ చేరిన కేసు
ఏడాదికి పైగా విచారణ
భూ కక్షలకు బలి అయిన బాలిక
ఆలయంలోనే మత్తుమందిచ్చి అత్యాచారం

పఠాన్‌కోట్ : జమ్మూ కశ్మీర్‌లోని కథూవాలో బాలికపై అత్యాచారం హత్య ఉదంతంలో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. మరో ముగ్గురికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పఠాన్‌కోట్ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. కథూవాలో బక్రవాల్ సంచార జాతికి చెందిన కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, తరువాత హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది.ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన సాంజీరామ్, దీపక్ ఖజూరియా, పర్వేశ్‌కుమార్‌లకు యావజ్జీవశిక్ష పడింది. ఈ ఘటనలో అక్కడి గ్రామ పెద్దలు ఇతరులు నిందితులుగా ఉన్న కేసు విచారణ దాదాపు ఏడాది పాటు సాగింది.

ఇప్పుడు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ న్యాయస్థానం సోమవారం ముగ్గురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదును, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్షలను ఖరారు చేసింది. ఈ ముగ్గురిపై సాక్షాధారాలను ధ్వంసం చేశారనే అభియోగాలపై విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో ఘటనకు సూత్రధారిగా వ్యవహరించిన సాంజీరామ్ కుమారుడు విశాల్ జంగోత్రాకు సంబంధించి సరైన సాక్షాలు లేకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు. కోర్టులో బాధితురాలి కుటుంబానికి ప్రాతినిధ్యం వహించిన ముబీన్ ఫరూకీ న్యాయస్థానం తీర్పు వివరాలను వెల్లడించారు.

గత ఏడాది జనవరిలో కథూవాకు సమీపంలోని రసానా గ్రామానికి చెందిన ఈ చిన్నారి మృతదేహం ముళ్లపొదలలో కన్పించింది. జనవరి పదవ తేదీన గుర్రాలను మోపుకుని రావడానికి వెళ్లిన ఈ బాలికపై అక్కడికి సమీపంలోని దేవాలయంలోనే అత్యాచారం హత్య జరిగినట్లు నిర్థారణ అయింది. ఈ దేవస్థానానికి ప్రధాన నిందితులలో ఒకరైన సాంజీరామ్ సంరక్షకుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఆయనతో పాటు ప్రత్యేక పోలీసు విభాగం అధికారి దీపక్ ఖజూరియా, ఆ ప్రాంత నివాసి పర్వేష్ కుమార్‌లను ప్రధాన నిందితులుగా నిర్థారించి రణబీర్ శిక్షాస్మృతి పరిధిలో శిక్షలు విధించారు. నేరపూరిత కుట్ర, హత్య, అపహరణ, సామూహిక అత్యాచారం, సాక్షాధారాల ధ్వంసం, బాధితురాలికి మత్తుమందు ఇవ్వడం, ఉమ్మడి కసి వంటి చర్యలకు దిగితే ఈ శిక్షాస్మృతి పరిధిలో శిక్షలు పడుతాయి.

జమ్మూ కశ్మీర్‌లో ప్రత్యేకంగా ఈ క్రిమినల్ కోడ్ శిక్షలను తీసుకువచ్చారు. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వారు కోరారు. అయితే ముగ్గురికి జీవిత ఖైదు, తలో లక్ష రూపాయల జరిమానా విధించారని లాయర్ తెలిపారు. ఈ ముగ్గురు దోషులు వారు చనిపోయే వరకూ జైలులోనే గడపాల్సి ఉంటుంది. వారిపై ఈ జీవిత ఖైదు శిక్షతో పాటే వేర్వేరు జైలుశిక్షలను ఈ శిక్షాస్మృతి (ఆర్‌పిసి) పరిధిలోనే ఇదే కాలంలో అమలు చేస్తారని ప్రాసిక్యూషన్ వారు తెలిపారు.

ఇక ఈ ప్రధాన నిందితులకు సహకరించిన ముగ్గురిలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ప్రత్యేక పోలీసు అధికారి సందీప్ వర్మలకు ఐదేళ్ల జైలుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించారు. నిందితులకు మరణశిక్ష కోసం తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఒకరిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తామని ప్రాసిక్యూషన్ బృందంలోని న్యాయవాదులు జెకె చోప్రా, ఎస్‌ఎస్ బాస్రా, హర్మీందర్ సింగ్ తెలిపారు. గుర్రాలు మోపుతూ బతికే దేశదిమ్మరి కుటుంబానికి కథూవా ప్రాంతంలోని భూస్వాములకు మధ్య స్థల వివాదం వల్లనే కక్షలు పెంచుకుని ఉద్శేశపూర్వకంగానే ఈ బాలికను ఎత్తుకువెళ్లి , దారుణంగా హింసించి చంపివేశారని వెల్లడైంది.

సంచార జాతులపై కక్ష పెంచుకున్న సాంజీరామ్

రసానా గ్రామంలో సంచార జాతులకు, స్థానిక గ్రామ పెద్దలకు తగాదాలు ఉన్నాయి. తమ పొల్లాల్లో సంచార జాతుల వారు గుర్రాలను వదిలిపెడుతున్నారని భూస్వాములు ఆగ్రహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడి గ్రామ పెద్ద , రెవెన్యూ శాఖలో గతంలో పనిచేసిన సాంజీరామ్ వారిని భయపెట్టేందుకు వ్యూహం పన్నినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తొలుత ఈ బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని గుడికి తీసుకువెళ్లి బంధించారు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి సాంజీరామ్ ఇతరులు ఆమెపై అత్యాచారం జరిపారు. తరువాత రాళ్లతో కొట్టి చంపివేశారు. ఈ ఘోరం వెలుగులోకి రాకుండా ఉండేందుకు స్థానిక పోలీసులకు లంచాలు ఇచ్చారు. అధికారులను తప్పుదోవ పట్టించి, ఉదంతం వెలుగులోకి రాకుండా చేశారు.

ఈ ఘటన మీడియాలో రావడం, పలు సంస్థలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ కేసులో ఒక బాలుడితో పాటు మొత్తం ఎనమండుగురిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.ఈ బాలుడు సాంజీరామ్ మేనల్లుడు. ఈ కేసుకు సంబంధించి ఈ బాలుడి వయస్సు నిర్థారణ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదు. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి 15 పేజీల ఛార్జీషీట్ దాఖలు అయింది. కిడ్నాప్ అయిన వారం రోజుల తరువాత బాలిక శవం దారుణ రీతిలో గుర్తించారు. నాలుగు రోజుల పాటు బాలికకు మత్తుమందు ఇచ్చి హింసించి చంపివేశారు.

Three of the Kathua murder case were life imprisonment

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కథువా కేసులో ముగ్గురికి జీవిత ఖైతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: