టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

Car-Accident

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్చురీకి తరలించారు. వీరు బిహార్ లో ప్రైవేటు పాఠశాల నడుపుతున్నట్టు సమాచారం. కారులో బిహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను కేరళకు చెందిన అనీష (32), స్టాలిన్ (21),అనాలియ(01)లుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.