డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి మరో కారుపై..

  దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి శామీర్‌పేట : రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన హృదయ విదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్‌ఫెక్టర్ నవీన్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని నాగోలు బండ్లగూడ ప్రాంతానికి చెందిన కోసూరి కిశోర్ చారి(50), అతని భార్య భారతి( […] The post డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి మరో కారుపై.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

శామీర్‌పేట : రాజీవ్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన హృదయ విదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్‌ఫెక్టర్ నవీన్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని నాగోలు బండ్లగూడ ప్రాంతానికి చెందిన కోసూరి కిశోర్ చారి(50), అతని భార్య భారతి( 45)లు తన ఇద్దరు కుమారులు సుధాన్ష్(20), తనీష్‌లతో కలిసి ఈకో స్పోర్ట్ కారులో దైవ దర్శనానికి వెల్లి సిద్దిపేట వైపు నుంచి నాగోలు బండ్లగూడకు వస్తున్నారు. అతివేగంగా వచ్చిన కారు మార్గమధ్యంలోని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రాజీవ్ రహదారిపై డివైడర్‌ను డీ కొట్టింది.

దింతో పల్టీలు కొడుతు నగరం నుంచి సిద్దిపేట వైపుకు వెల్తున్న మహేష్, రాజుల ఎర్టిగా కారుపై పడింది. దింతో కిశోర్ చారి, భారతి, సుధాన్ష్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, తనీష్, రాజు, మహేష్‌లకు గాయాలు అయ్యాయి. గాయాలైన క్షతగాత్రులను 108 అత్యవసర వాహనంలో అల్వాల్ పరిధిలోని జుబ్లీ ఆస్పత్రికి తరలించారు. అందులో తనీష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐలు శ్రీనివాస్, నవీన్‌రెడ్డిలు, స్థానికుల సహయంతో జేసిబి, క్రేన్ సహయంతో గంట పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. ఈ మేరకు ఇన్స్‌ఫెక్టర్ నవీన్‌రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Three killed in Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి మరో కారుపై.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: