గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

killed
హైదరాబాద్‌: నగరంలోని హబీబ్‌నగర్ పరిధిలోని అఫ్జల్‌సాగర్ రోడ్డు మాన్‌గిరి బస్తీలో గురువారం అర్థరాత్రి విషాదం చోటుచేసుకుంది. మాంగర్ బస్తీలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ముక్కుపచ్చలారని చిన్నారులు రోషిణి (6), సారిక (3), నాలుగు నెలల చిన్నారి పావని అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ఒకే కుటుంబానికి చెందినవారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో మాంగర్ బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Three girls killed in wall collapsed at hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.