మూడు తరాల వినోదం

Sai Dharam Tej

 

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవలే మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘ప్రతిరోజు పండగే’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మారుతి అన్ని సినిమాల మాదిరిగానే ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుందట. ఫన్ మొత్తం హీరో కుటుంబం మీదనే నడుస్తుందట. అది కూడా తాత, తండ్రి, మనవడు అంటూ మూడు తరాల మధ్య జరుగుతుందని తెలిసింది. వీరిలో మనవడు తేజ్ కాగా తండ్రిగా రావు రమేష్, తాతగా సత్యరాజ్ నటిస్తారట. ఈ చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యం కలిగి ఉంటుందని కూడా తెలిసింది. గీతా ఆర్ట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటించనుంది.

Three generations story in Prati Roju Panduga movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడు తరాల వినోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.