రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం..!

మెదక్: ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని మరో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను నార్సింగ్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన బి సురేశ్, సింగరబోయిన సంతు, […]

మెదక్: ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని మరో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను నార్సింగ్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన బి సురేశ్, సింగరబోయిన సంతు, అందె రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: