శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ ముగ్గురు మృతి

Road Accident

 

నిజామాబాద్ : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి వద్దగల సిఎంసి ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. జిల్లాలోని డిచ్‌పలి మండలం మెంట్రాజిపల్లి గ్రామానికి చెందిన జయ్య సుమన్ (18), సిరికొండ మండలం కొండూర్ గ్రామానికి చెందిన ఎరుకల రాజవ్వ, అనూష్‌లు కలిసి పెళ్లి శుభలేఖలు పంచేందుకు బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి లారీని ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three Dead in Deadly road accident at Suddapalli

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.