వాగులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం…

children

 

మహబూబ్‌నగర్ జిల్లా రాజోళిలో విషాదం

రాజోళి : మహబూబ్‌నగర్ జిల్లా మండల కేంద్రమైన రాజోళిలో ముగ్గురు పిల్లలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాజోళి గ్రామానికి చెందిన చరణ్ (7), యుగంధర్ (8), శివయ్య (8) ముగ్గురు పిల్లలు కలిసి ఉదయం 11 గంటల సమయంలో ఆడుకునేందుకు భయటకు వెళ్ళారు. ఊరి సమీపంలో ఉన్నటువంటి పెద్దవాగులో ఇటివల పూడిక తీయడంతో ఆడుకునేందుకు వెళ్ళిన పిల్లలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు.

అయితే సాయంత్రం 6 గంటలు అయిన ఇంటికి పిల్లలు రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామం మొత్తం వెతికారు. పిల్లలు చనిపోయిన ప్రదేశంలో చెప్పులు కనబడటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా రాత్రి 8గంటల సమయంలో శవాలను వెలికి తీశారు. గ్రామంలోని శ్రీరాంనగర్ కాలనీకు చెందిన పిల్లల తల్లిదండ్రులు ఒకరు చేనేత, ఇంకోకరు కూలి, హోటల్ గడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు మగపిల్లలు తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.

Three children have died in Water ditch

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వాగులో పడి ముగ్గురు పిల్లల దుర్మరణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.