తమిళనాడులో డూప్లికేట్ ఎస్‌బిఐ బ్రాంచ్

Three arrested for running duplicate SBI Bank branch

చెన్నై: తమిళనాడులో డూప్లికేట్ ఎస్‌బిఐ బ్రాంచ్ కలకలం రేపింది. అన్ని సౌకర్యాలతో ఫేక్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నింధితుడు కమల్ బాబులో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్‌రూటి తాలుకాలో జరిగింది. ఈ ముగ్గురు యువకులు లాక్ డౌన్ టైమ్ లో నకిలీ బ్యాంచ్ ను ప్రారంభించారు.

మూడు నెలలుగా భారీగా అకౌంట్లు ప్రారంభించి డిపాజిట్లు వసూలు చేేశారు. డబ్బుల కోసం వెళ్లిన కస్టమర్లు కంగుతిన్నారు. నిందితుడి తల్లిదండ్రులు ఎస్బీఐ మాజీ ఉద్యోగులు కావడం విశేషం. ఇప్పటివరకు బ్యాంకులకు కన్నాలు వేసే వాళ్లనే చూశాం. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే వాళ్లనూ చూశాం. అయితే ఈ ప్రబుద్ధులు రొటీన్‌ కు బిన్నంగా ఏకంగా డూప్లికేట్ ఎస్‌బిఐ బ్రాంచ్‌ను పెట్టారు. మూడు నెలల  బాగానే సాగిన ఈ నకిలీ బ్రాంచ్‌ వ్యవహారం చివరికి ఓ కస్టమర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

Three arrested for running duplicate SBI Bank branch

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తమిళనాడులో డూప్లికేట్ ఎస్‌బిఐ బ్రాంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.