పూరీ జగన్నాథ్ కు బెదిరింపులు

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెడతానని మురళీ అనే వ్యక్తి పూరీ జగన్నాథ్ ను బెదిరించాడు. దీంతో పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను ఇన్ […] The post పూరీ జగన్నాథ్ కు బెదిరింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెడతానని మురళీ అనే వ్యక్తి పూరీ జగన్నాథ్ ను బెదిరించాడు. దీంతో పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెడతానని మురళీ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూరీ కోరారు. దీంతో మురళీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను తాను వేరే వెబ్ సైట్ నుంచి తీసుకున్నానని, తాను డబ్బు డిమాండ్ చేయలేదని మురళీ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నానని పోలీసులు తెలిపారు.

Threats to Director Puri Jagannath

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పూరీ జగన్నాథ్ కు బెదిరింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: